‘‘తెలంగాణ వచ్చినంక కూడా ఇంత అన్యాయం జరుగుతుంటే ఉద్యమ నాయకునిగా చెప్పుకునే కేసీఆర్ నోరు విప్పకపోవడంలో అంతర్యం ఏమిటి.? దక్షిణ తెలంగాణను ఎడారిగా మారుస్తారా.! క్రిష్ణా జలాలలో వాటా కోసం ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై,కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమాన్ని చేపట్టడం లేదు. తెచ్చుకున్న తెలంగాణ కు అర్థమేమిటి.? జయశంకర్ సార్ కెసిఆర్ లాగా మౌనంగా ఉండి ఉంటే తెలంగాణ వచ్చి ఉండేదా.! రాష్ట్ర ముఖ్యమంత్రి మౌనంగా ఉండడం జయశంకర్ ఆశయాలకు ఆలోచనలకు విరుద్ధం కాదా.!’’
జయశంకర్ అలోచనల పట్ల వీరికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది.సమైక్య శక్తులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి స్వయం ప్రకటిత జాతి పితగా ప్రచారం చేసుకోవడం నియంతృత్వ విధానాలకు పరాకాష్ఠ కాదా.! ముఖ్యమంత్రి వారి ప్రజాప్రతినిథులు, వందిమాగదులు తెలంగాణ జాతిపిత కెసిఆర్ మాత్రమేనని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అవివాహితుడిగా తన జీవితమంతా ఈ ప్రాంత ప్రజల కోసం త్యాగం చేసి ఒక సైద్ధాంతిక భూమిక పోషించిన ఆచార్య జయశంకర్ గారిని తెలంగాణ జాతిపితగా ప్రకటించకపోవడం ఫ్యూడల్ విధానాలకు నిదర్శనం కాదా.! తెలంగాణ చరిత్రలో జయశంకర్ సార్ కున్న స్థానాన్ని కనుమరుగు చేస్తారా.!
ఉద్యమాల పై ఉక్కుపాదం మోపడం జయశంకర్ ఆలోచనలకు విరుద్దం కాదా.!
ప్రజాస్వామిక ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఉజ్వలంగా తీర్చిదిద్దేంధుకు దేశ చరిత్రలో మునుపెన్నడు లేని విధంగా పరిపాలనలో వినూత్న సంస్కరణలకు బాటలు వేస్తామని కేసీఆర్ హమి ఇచ్చారు.,అంధుకు సామాజిక ప్రజా సంఘాల తో జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రజా కమిటీ లు ఏర్పడతాయని చెప్పారు.’’పౌర సమాజం’’కనుసన్నలో జవాబుదారీతనం తో పారదర్శకంగా ప్రజాస్వామికంగా పరిపాలన చేస్తామన్నారు.అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే ప్రజా సంఘాల నేతల ను టార్గెట్ గా చేసుకొని ఇంటి తలుపులు బద్దలుకొట్టడానికి కూడా కేసీఆర్ వెనుకాడలేదు.ప్రజా ఉధ్యమకారులను అణచడం పౌర సమాజాన్ని గౌరవించడమా.! పౌర సమాజం ప్రజా సమస్యలు లేవనెత్తినా.. ధర్నాలకు రాస్తారోకోలకు పిలుపునిచ్చినా.. హల్ మీటింగ్ లకు సిద్ధమైనా.. నిరసన ర్యాలీ లకు బయలు దేరినా అడుగడుగునా హౌస్ అరెస్టు లు చేసి అక్రమ నిర్బంధం ప్రయోగించింది వాస్తవం కాదా.! మరో అడుగు ముంధుకేసి లాఠీ లు ఝలిపించినది నిజం కాధా.! ఇన్ని అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారు తెలంగాణ పునర్నిర్మాణానికి పౌర సమాజం సహకారం ఎక్కడ తీసుకున్నారో చెప్పగలరా.!
పోరాటం ద్వారా ఏర్పడ్డ నూతన రాష్ట్రంలో ఉద్యమాలకు స్థానం లేకుండా కేసీఆర్ నియంతలాగా వ్యవహరిస్తున్నది నిజం కాదా.! జయశంకర్ గారు ప్రజా సంఘాలను సమాజాన్ని కి ప్రాణంగా భావించి న వాటిని.. స్వరాష్ట్ర పాలకులు ఉక్కుపాదం తో అణచివేయడం జయశంకర్ సార్ వెలిబుచ్చిన ప్రజాస్వామిక ఆకాంక్ష లకు విరుద్ధం కాదా.! అనాడు తెలంగాణ వివక్షతలకు గురైతే,నేడు జయశంకర్ సార్ కొనసాగించిన విలువలను,ఉద్యమ స్ఫూర్తిని కనుమరుగు చేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నాడు.ఇలాంటి విధానాలు జయశంకర్ ఆలోచనలకు విరుద్ధం.
జయశంకర్ ను స్మరించుకోవడం అంటే భవిష్యత్ ఉద్యమాలకు పునాదులు వేయడమే
జయశంకర్ సార్ ను స్మరించుకోవడమంటే వారు ఆకాంక్షించిన ప్రజాస్వామిక తెలంగాణ కోసం కార్యచరణను, ఉద్యమ ఆకాంక్షలను నెమరువేసుకొని భవిష్యత్ ఉధ్యమాన్ని కి సంసిద్దులు కావడమే.
తెలంగాణ ఏర్పడిన తొమ్మిదేళ్ల కాలంలోఇచ్చిన హామీలను,చేసిన పనులను,ప్రజల ఆకాంక్షలను, ఉధ్యమ లక్ష్యాలను అవలోకనం చేసుకోవడం అంటే జయశంకర్ సార్ విలువలను,నిబద్దతను, ప్రతిష్టను, వారి రాజిలేని పోరాటాన్ని, వారి నిజాయితీ ని, ఆలోచనలను కొనసాగి ంచడమే.ఆ వైపు గా ముంధు కు సాగడ మంటే తెలంగాణ జనజీవనం లో జయశంకర్ సార్ కృషి పలించినట్లే.
– పందుల సైదులు, తెలంగాణ విద్యావంతుల వేదిక
9441661192




