జనగామ గడ్డ…ఉద్యమాల అడ్డ

  • కన్నతల్లి లాంటి కాంగ్రెస్‌ ‌పార్టీని మోసం చేసిన వారిని బండకేసి కొడుతాం
  • ప్రగతి భవన్‌లో ఆంధ్రా కాంట్రాక్టర్లకు తప్ప…రాష్ట్ర ప్రజలకు ప్రవేశం లేదు
  • జనగామ ఎన్నికల ప్రచార సభలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి
  • అబద్ధాల, కబ్జాల సీఎం కేసీఆర్‌ : ‌కొమ్మూరి ప్రతాప్‌ ‌రెడ్డి

జనగామ, ప్రజాతంత్ర, నవంబర్‌ 15 : ‌కన్నతల్లి లాంటి కాంగ్రెస్‌ ‌పార్టీని మోసం చేసిన వారిని బండకేసి కొడతామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామ జిల్లా కేంద్రంలోని ప్రేస్టియన్‌ ‌గ్రౌండ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి కొమ్మూరి ప్రతాపరెడ్డి భారీ మెజార్టీతో గెలిపించాలని బహిరంగ సభ నిర్వహించారు. ఈ బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా రేవంత్‌ ‌రెడ్డి హాజరై మాట్లాడుతూ…కాంగ్రెస్‌ ‌పార్టీ హయాంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరిగిందన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి కాంగ్రెస్‌ ‌పార్టీ గెలుపు కొరకు ప్రతి ఒక్క కార్యకర్త సైనికులుగా పని చేయాలన్నారు. తెలంగాణ ప్రజల రెండువేల కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రగతి భవన్లో ఆంధ్ర కాంట్రాక్టర్లకు తలుపులు తీసి ఉంటాయని ప్రజల సొమ్ముతో నిర్మించిన తెలంగాణ ప్రజలకు మాత్రం ప్రవేశం ఉండదన్నారు.

2014లో ఇందిరమ్మ ఇల్లు డబ్బా ఇల్లులు అన్న సీఎం కెసిఆర్‌ ఇం‌తవరకు ఏ ఒక్కరికి కూడా డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇవ్వలేదని, ఆయనకు మాత్రం వెయ్యి ఎకరాల ఫామ్‌ ‌హౌస్‌ ‌వొచ్చిందన్నారు. లక్ష కోట్లు ఖర్చుపెట్టి కాళేశ్వరం ద్వారా మేడిగడ్డ బ్యారేజీ నిర్మించి వేల కోట్లను దండుకున్నారన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వొస్తే రైతు బంధు బంధు అవుతుందని మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ ‌పార్టీకే దక్కుతుందన్నారు. సీఎం కేసీఆర్‌ ‌దశాబ్ది కాలంలో శతాబ్దం వరకు సరిపడా డబ్బులు దోచుకున్నారన్నారు. హెలికాప్టర్‌ ‌నుండి ప్రజలను చూస్తే పల్లా రాజేశ్వర్‌ ‌రెడ్డిని 100 మీటర్ల గోతిలో వేయడానికి వొచ్చారా అన్నట్లు అనిపిస్తుందన్నారు. జనగామ గడ్డ..ఉద్యమాల అడ్డా అని, తొలి, మలి తెలంగాణ ఉద్యమంలో జనగామ ప్రజలు చురుగ్గా పాల్గొన్నారన్నారు.

అబద్ధాల, కబ్జాల సీఎం కేసీఆర్‌ : ‌కొమ్మూరి ప్రతాప్‌ ‌రెడ్డి
రేవంత్‌ ‌రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని, సోనియా గాంధీ దయ వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్‌ ‌పెద్ద దొంగ అని, అబద్దాల, కబ్జాల ముఖ్యమంత్రి అన్నారు. స్థానికుడైన తనను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. కొమ్మూరి ప్రతాపరెడ్డి నీతిమంతుడు అని తెలిసి రేవంత్‌ ‌రెడ్డి తనకు టికెట్‌ ‌కేటాయించడం జరిగిందన్నారు.

సీఎం కేసీఆర్‌ ‌జనగామకు వొచ్చినప్పుడు పల్లా రాజేశ్వర్‌ ‌రెడ్డి తనతోనే ఉంటాడు..తింటాడు అని చెప్పడం జరిగిందని, కెసిఆర్‌ ‌వెంట ఉండే నాయకుడు కావాలో, అభివృద్ధి చేసే నాయకుడు కావాలో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. పల్ల రాజేశ్వర్‌ ‌రెడ్డి ఘట్కేసర్‌లో అమాయక ప్రజల ఫ్లాట్లను కబ్జా చేసి వారిని ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుందన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందాక జనగామ సమస్యలను పరిష్కరిస్తానన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *