ఉప్పల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 11: ప్రజా బాంధవుడు, జనం మెచ్చిన నేత ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ని సత్కరించి పలువురు నాయకులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం సైనిక్ పూరి లోని బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయం లో నూతనంగా ఎన్నికైన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ని కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలు కాలనీల సంక్షేమ సంఘం సభ్యులు, అభిమానులు ,ఎమ్మెల్యే నివాస వద్దకు భారీగా చేరుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మీ అభిమానం, మీ ప్రేమ ఎల్లవేళలా ఇలాగే ఉండాలన్నారు.
జనం మెచ్చిన నేత ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కి పలువురు నాయకులు, అభిమానులు శుభాకాంక్షలు వెల్లువ




