- రాజ్యసభను సమర్థంగా నడిపే నాయకుడు
- సభలో అభినందించిన ప్రధాని మోదీ
- రాజ్యసభ ఛైర్మన్‌గా ధన్కర్ బాధ్యతల స్వీకరణ
- కొత్త సభ్యులకు సభలో అవకాశం రావాలని ఆకాంక్ష
న్యూ దిల్లీ, డిసెంబర్ 7 : ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ దేశంలోని ఎంతోమందికి స్ఫూర్తి అని ప్రధాని మోడీ అన్నారు. రాజ్యసభ చైర్మన్‌గా తొలిసారి బాధ్యతలు చేపట్టిన ధన్కర్కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా మోడీ రాజ్యసభలో మాట్లాడుతూ ఎన్నో బాధ్యతలను ధన్కర్ సమర్ధవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. రైతుబిడ్డ ఉపరాష్ట్రపతిగా ఎన్నకవడం సంతోషంగా ఉందని మోడీ తెలిపారు. ధన్కర్కు చట్టాలపై ఎంతో అవగాహన ఉందన్నారు. ఈ సభతో పాటు దేశం తరుపున ధన్కర్కు అభినందనలు తెలిపారు. జీ20 బాధ్యతలు చేపట్టిన సమయంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నా యని మోడీ అన్నారు. జీ20 సదస్సుకు సన్నద్ధం కావాల్సిన సమయమిదన్నారు. ప్రజాసమస్యలపై చర్చించే ందుకు పార్లమెంట్ మంచి వేదిక అని చెప్పారు. ఇది అమృతకాలం ప్రారంభస మయమన్నారు.
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సులభంగా బాధ్యతతో సాధించడంలో మన పార్ల మెంటు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని మోడీ అన్నారు. దేశానికి రాజ్యసభ అతిపెద్ద బలం అని.. మన ప్రధానులు చాలా మంది రాజ్యసభ సభ్యులుగా పనిచేశారని చెప్పారు. అంతుకుముందు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. అన్ని అంశాలపై ప్రభుత్వం చర్చకు సిద్దంగా ఉందన్నారు. జీ-20 సదస్సును భారత్ నిర్వహించడం గర్వకారణమన్నారు. ఈ సమావేశాలు భారత్‌కు చాలా కీలకమన్నారు. కొత్త ఎంపీలకు , యువ ఎంపీలకు ప్రజా సమస్యలను ప్రస్తావించేందుకు సభలో అవకాశం లభించాలన్నారు ప్రధాని మోదీ. మూడు వారాల పాటు జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం ప్రారంభమ య్యాయి. మొదటి వారం వేడిగా ఉండే అవకాశం ఉంది. పార్లమెంట్లో ప్రసంగి స్తున్నప్పుడు ప్రధాన మంత్రి, చైర్మన్‌కి సభతో పాటు దేశం తరపున కూడా అభినందనలు తెలిపారు.
పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముందు, సమావేశాలను మరింత ఉత్పాదకంగా మార్చేందుకు అన్ని పార్టీలు సమిష్టిగా కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అభ్యర్థించారు. భారతదేశం యొక్క ఉ20 ప్రెసిడెన్సీని ప్రస్తావిస్తూ, అతను ఇలా అన్నారు. జి 20 సమ్మిట్ కేవలం దౌత్య కార్యక్రమం కాదు, ఇది భారతదేశ సామర్థ్యాన్ని ప్రపంచం ముందు ప్రదర్శించడానికి ఒక అవకాశం. ఇంత పెద్ద దేశం, ప్రజాస్వామ్యానికి తల్లి, అటువంటి వైవిధ్యం, అటువంటి సామర్థ్యం ప్రపంచా నికి భారతదేశాన్ని తెలుసుకోవడం. భారతదేశం తన సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించడానికి ఇది ఒక అవకాశం అన్నారు. ఇదిలావుంటే పరిశీలన, ఆమోదం కోసం 16 కొత్త బిల్లులను రూపొందించిన ప్రభుత్వాన్ని కార్నర్ చేయడానికి దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడంతో సహా అనేక సమస్యలను ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్దంగా ఉన్నాయి. ప్రభుత్వం శాసనసభ ఎజెండాలో 25 బిల్లులు ఉంటాయి. వాటిలో 16 కొత్తవి, ఏడు పెండింగ్‌లో ఉన్నవి. రెండు ఆర్థిక బిల్లులు. డిసెంబర్ 29న ముగిసే ముందు 23 రోజులపాటు 17 సమావేశాలు జరగనున్నాయి.




