జంగమ సమాజం నూతన కార్యవర్గం ఎన్నిక ..అధ్యక్షులుగా గూళి శివకుమార్ స్వామి

తాండూరు, ప్రజాతంత్ర, జులై 23 : తాండూరు జంగమ సమాజం నూతన కార్యవర్గం ఎన్నిక కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం పట్టణంలోని వీరశైవ సమాజం ఫంక్షన్ హాల్ లో ఎన్నిక నిర్వహించారు. జంగమ సమాజం గౌరవాధ్యక్షులుగా గూళి నీలకంఠ స్వామి, అధ్యక్షులుగా గూళి శివకుమార్ స్వామి, ప్రధాన కార్యదర్శులుగా మఠం నిరంజన్ స్వామి, ఉపాధ్యక్షులుగా గూళి విశ్వనాథం, సలహదారులుగా సిద్ధలింగయ్య స్వామి, మఠం చంద్రశేఖర్ స్వామి, సహాయ కార్యదర్శులుగా టేకుల్ కోడ్ జగదీశ్వర్ స్వామి, మఠం చెన్నబసప్ప, కోశాధికారిగా హీరేమట్ బస్వరాజ్ స్వామి, అర్చక కన్వినర్ గా రుద్రారం జగదీశ్వర్ స్వామి, జంగం చంద్రకాంత్ స్వామి, మడపతి కిరణ్ కుమార్ స్వామి, మడపతి శివశంకర్ స్వామి, కార్యవర్గ సభ్యులుగా మడపతి చెన్వీరయ్య స్వామి, జంగం సంతోష్ కుమార్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ జంగమ సమాజం అభ్యున్నతికి కృషి చేస్తామని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *