చెరువు బురదలో కూరుకుపోయి తండ్రీకొడుకుల మృతి

తిరుపతి, డిసెంబర్‌ 6 : ‌జిల్లాలోని గ్రద్దకుంటలో విషాదం చోటుచోసుకుంది. పశువుల కుంటలో కూరుకుపోయి తండ్రీ కొడుకులు ఇద్దరూ మృత్యువాత పడ్డారు. సోమవారం సాయంత్రం పశువులను కడిగేందుకు చెరువులో దిగిన తండ్రి చెంగయ్య బురదదలో కూరుకుపోయాడు.

పశువులు ఇంటికి చేరుకున్నప్పటికీ తండ్రి రాకపోవడంతో అనుమానంతో కుమారుడు నాగార్జున చెరువులో దిగగా ఆయన అందులో కూరుకుపోయి ఊపిరి ఆడక మృతి చెందాడు. కుమారుడి మృతదేహం లభ్యం కాగా తండ్రి చెంగయ్య కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *