ఉప్పల్, ప్రజాతంత్ర, జూలై 19: వ్యాపారంలో బాగా రాణించి ఉన్నత స్థానాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. బుధవారం ఉప్పల్ నియోజకవర్గంలోని చిల్కానగర్ డివిజన్ అన్నపూర్ణ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆగ్రా స్వీట్ హౌస్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బండారి లక్ష్మారెడ్డి లు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాపారంలో బాగా రాణించి ఉన్నత స్థానాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య, బీఆర్ఎస్ నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ , మేకల హనుమంత రెడ్డి, గంధం నాగేశ్వరరావు, నందికొండ శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.




