సిద్దిపేట, ప్రజాతంత్ర, జూలై 23: సిద్దిపేట పట్టణం లో ఫుట్ పాత్ ల పై చిరు వ్యాపారం చేసే వారికి మంత్రి హరీష్ రావు నీడనిచ్చారు. ఎండనక వాననక పొట్టకూటికోసం కష్ట పడి చిరు వ్యాపారం చేసుకొనే వారికి మంత్రి హరీష్ రావు అండగా నిలిచారు.ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి హరీష్ రావు సిద్దిపేట లో పర్యటించగా ఫుట్ పాత్ ల పై కంకులు , పూలు, పండ్లు అమ్ముకొనే వారు వర్షం లో తడవటం చూసిన సందర్భం మనసు కదిలించింది.. వెంటనే వారికి గొడుగులు ఏర్పాటు చేయాలి అని చెప్పారు.ఈ నేపథ్యంలో సిద్దిపేట పట్టణము లో చిరు వ్యాపారం చేసుకొనే వారికి మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు , పార్టీ అధ్యక్షులు కొండం సంపత్ రెడ్డి, మంత్రి హరీష్ రావు పంలించిన గొడుగులను పంపిణీ చేసారు.ఈ కార్యక్రమంలో ఆర్టిఏ సభ్యులు ఈర్షద్, కౌన్సిలర్స్ నాయకం లక్ష్మన్, సుందర్, తిరుమల్ రెడ్డి, నాగరాజు, మల్లి ఖార్జున్ , ప్రవీణ్, సర్పంచ్ నరేష్, విద్యార్తి విభాగం నాయకులు రమేష్, సతీష్, మధు, తదితరులు, పాల్గొన్నారు.




