చిన్నారులను విక్రయిస్తున్న అంతర్‌ రాష్ట్ర ముఠా

  • పక్కా సమాచారంతో 16 మంది చిన్నారులకు రక్షణ
  • ఆర్‌ఎంపి డాక్టర్‌తో సహా మరో ఇద్దరి అరెస్ట్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 28 : చిన్నారులను విక్రయిస్తున్న అంతర్‌ రాష్ట్ర ముఠాను రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ముఠా నుంచి 16 మంది చిన్నారులను కాపాడారు. వీరిలో కొందరు ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలు ఉన్నట్టు గుర్తించారు. ఇటీవల మేడిపల్లిలో చిన్నారి విక్రయంతో ముఠా వ్యవహారం వెలుగులోకి వొచ్చింది. నాలుగు రోజుల క్రితం పీర్జాదిగూడలో రూ.4.50లక్షలకు ఆర్‌ఎంపీ డాక్టర్‌ శోభారాణి శిశువును విక్రయించారు. ఆమెకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేయడంతో ముఠాగుట్టు రట్టయింది. మొత్తం 16 మంది చిన్నారులను ఈ ముఠా విక్రయించినట్టు నిర్ధరించారు. కేసు వివరాలను రాచకొండ సీపీ తరుణ్‌ జోషి మంగళవారం వ్నిడియాకు వెల్లడిరచారు.

ఈ సందర్భంగా సీపీ  మాట్లాడుతూ.. ఈ రాకెట్‌తో సంబంధం ఉన్న ఏజెంట్లు, సబ్‌ ఏజెంట్లు మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశామని, ఇటీవల మేడిపల్లిలో శోభారాణి, సలీం, స్వప్నలను అరెస్టు చేశామని, వారిని అరెస్టు చేసిన సమయంలో ఇద్దరు చిన్నారులను రక్షించామని, సంతానం లేని వారికి పిల్లలను విక్రయిస్తున్నట్టు గుర్తించామని, దిల్లీ, పుణె నుంచి చిన్నారులను తీసుకొచ్చి అమ్ముతున్నట్టు దర్యాప్తులో తేలిందని, దిల్లీ, పుణెలో ఉన్నవారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందం వెళ్లిందని, తల్లిదండ్రుల నుంచి రూ.50వేలకు కొనుగోలు చేసి.. రూ.1.80 లక్షల నుంచి రూ.5.50 లక్షల వరకు చిన్నారులను విక్రయిస్తున్నారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *