చిన్నకోడూరులో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు 

చిన్నకోడూరులో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు
చిన్నకోడూరు, ప్రజాతంత్ర, జూన్ 17:
చిన్నకోడూరు మండల కేంద్రంలో  48 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ తో కలిసి  రాష్ట్ర ఆర్థిక,వైద్య,ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి హరీష్ రావు లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….ఒక పైసా ఖర్చు లేకుండా, ఒక చెమట చుక్క రాల్చకుండా  48 మందికి  అద్భుతమైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కట్టించి, గృహప్రవేశాలు  చేపించినాము అన్నారు.
గతంలో ప్రభుత్వం 40, 50 వేలు ఇచ్చి  ఇల్లు కట్టుకోమనేది. ఆ పైసలతో ఇల్లు పూర్తికాక అప్పుల పాలు కావాల్సి వచ్చేది. అంతేకాకుండా ఆ డబ్బుల కోసం బ్యాంకుల చుట్టూ తిరగవలసి వచ్చేది.కానీ ఇప్పుడు పైసా ఖర్చు లేకుండా, కష్టపడకుండా అద్భుతమైన ఇండ్లు ఇస్తున్నాము.
ఇప్పటికి చిన్నకోడూరు మండలంలో 479 మందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అందించాము. మరో వారం రోజుల్లో చౌడారంలో కూడా లబ్ధిదారులకు అందిస్తాము.
ఇంకా ఇండ్లు లేని పేదవారు ఉంటే సొంత జాగలోనే ఇళ్ళు కట్టుకునేలా రూ.3లక్షలు రూపాయలు ఇండ్ల నిర్మాణం కోసం మంజూరు చేస్తాం, జాగాలెన్నోళ్లకు ఇంటి స్థలాలను అందిస్తాం.
పేరుకు చిన్నకోడూరు చిన్నది కానీ అభివృద్ధిలో పెద్దది. అప్పట్లో కరువు సమయంలో పశువులకు కూడా మేత దొరుకక ఆంధ్ర నుంచి గడ్డిని తెప్పించి  పశుగ్రాసం కేంద్రాలను పెట్టినం.కానీ నేడు కాలేశ్వరం జలాలతో నాలుగు రాష్ట్రాలకు అన్నం పెట్టే దాన్య రాశిగా కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం వ్యవసాయరంగం అభివృద్ధి సాధించింది. మన తెలంగాణ రాష్ట్రంలో పండిన పంట కావాలని కర్ణాటక వాళ్ళు వడ్లు అడుగుతున్నారు.
కాలేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి నీళ్లు తెస్తామంటే ఒకప్పుడు ఎటకారంగా మాట్లాడిన వారు. ఇప్పుడు నీళ్లను చూసి ఆనందిస్తున్నారు.ఎండాకాలంలో కూడా చిన్నకోడూరు పెద్ద చెరువు మత్తడి పారుతుంది.
బంగారం లాంటి రెండు పంటలు పండుతున్నాయి.
అప్పట్లో రైతుల అప్పులు తీర్చడానికి బొంబాయి, దుబాయ్ పోయేవారు.రైతుల ఆత్మహత్యలతో దుఃఖాన్ని దిగుకున్న రోజులు గుర్తుకు వస్తాయి.ఒకప్పుడు ఆంధ్ర నుండి చాపలను  తెచ్చుకున్న మనం. కాలేశ్వరం జిల్లాలతో ఇప్పుడు ఆంధ్రకు, బెంగాల్ కు, విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం.
 సిద్దిపేట నుండి చిన్నకోడూరు వరకు సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుకు అభివృద్ధి చేసుకున్నాము. ఇప్పుడు 66 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్డు ను నాలుగు వరుసల రహదారిగా అభివృద్ధి చేసుకుంటున్నాము. మరో ఐదారు నెలల్లో పనులు పూర్తి అవుతాయి.
 రింగ్ రోడ్డు చిన్నకోడూరు మీదుగా పోతుంది.75% సబ్సిడీతో 550 స్ప్రింక్లర్లను చిన్న కోడూరు గ్రామ రైతులకు అందించాము.
1173 మందికి ఆసరా పింఛను అందిస్తున్నాము.
79 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశాము.
 26 మంది రైతు కుటుంబాలకు  5 లక్షల రూపాయల రైతు బీమా అందించాం.
తెలంగాణ ప్రాంతం ఆనాడు కరువుకు నెలవు… నేడు కరువుకు సెలవు.ప్రభుత్వ ఆసుపత్రులు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నాయి.బీపీ, షుగర్ గోలిలను ఇంటింటికి అందిస్తున్నాము.గర్భిణీలలో రక్తహీనత నివారించి ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చేందుకు న్యూట్రిషన్ కిట్టు ను అందిస్తున్నాము.
జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణశర్మ  మాట్లాడుతూ ..
ఒక్క పైసా ఖర్చు లేకుండా పారదర్శకంగా గ్రామ పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అందించిన సీఎం కేసీఆర్ కు, మంత్రి తన్నీరు హరీష్ రావుకు పేద ప్రజల తరఫున కృతజ్ఞతలు.
 ఒకప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే అప్పుల పాలు కావాల్సి వచ్చేది.
ఇప్పుడు ప్రభుత్వమే పైసా ఖర్చు లేకుండా ఉచితంగా ఇల్లు కట్టించి కరెంటు, త్రాగునీరు, రోడ్డు, డ్రైనేజీ అన్ని సౌకర్యాలు కల్పించింది.
 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు దేశానికి ఆదర్శం.
మహిళల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ఆరోగ్య మహిళా, రుతుప్రేమ కార్యక్రమాలను చేపట్టింది అన్నారు.ఈ  కార్యక్రమంలో ఎంపిపి మాణిక్య రెడ్డి, రాష్ట్ర నాయకులు రాధాకృష్ణ శర్మ,ఎమ్మార్ఓ జయ లక్ష్మీ, వైస్ ఎంపిపి పాపయ్య, రైతు బంధు సమితి సభ్యులు వెంకటేశం, బిఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ వనిత రవీందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ ఉమెష్ చంద్ర, సొసైటీ చైర్మన్ లు  కనక రాజు, సదానందం, ఎంపిటిసి లు శ్రీనివాస్, శారదా, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *