చర్చలు జరగలేదు.. సమ్మె ఆపేదిలేదు : సిఐటియు మండల కన్వీనర్ పోచమోని కృష్ణ

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,జూలై 22 : రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా మంచాల మండల కేంద్రంలో సమ్మె 17వ రోజుకు చేరింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,నేడు మంత్రితో ఎలాంటి చర్చలు జరగలేదని,సమ్మె ఆపేదిలేదని అన్నారు.పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గ్రామ పంచాయతి కార్మిక సంఘాల జేఏసీ నాయకులను చర్చలకు పిలిచినట్లే పిలిచి ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ అమెరికాకు వెళ్లారని ఆయన వచ్చిన తర్వాత చర్చలు జరుపుదామని సమ్మె మాత్రం విరమించమని చెప్పడం విడ్డూరమని ఆయన అన్నారు.చీఫ్ సెక్రెటరీ అమెరికా వెళ్ళింది మంత్రికి నిన్న తెలియదా అని ప్రశ్నించారు.తమ సమస్యల గురించి చర్చలు జరుపుతామని జేఏసీ నేతలను పిలిచింది ఎందుకని ఆయన ప్రశ్నించారు.కేవలం వినతి పత్రం తీసుకొని చీఫ్ సెక్రెటరీ లేరని చెప్పి చర్చలు జరుపకుండా వెల్లిపోవవడం హాస్యాస్పదమని అన్నారు.ఏదిఏమైనా కార్మికుల డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మెను ఆపకుండా మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఎన్ని రోజులైనా సమ్మెను కొనసాగించి తీరుతామని చెప్పారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతి ఉద్యోగ కార్మిక సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు ఖాజా పాషా భాస్కర్,నాయకులు శంకరయ్య,రవి,సురేష్ యాదయ్య,జంగయ్య,వెంకటయ్య,దర్శన్, రోసమ్మ,స్వరూప,అర్జున్,నర్సమ్మ,రెడియ, సుజాత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *