చట్ట సభల్లో బిసి బిల్లు ప్రవేశ పెట్టాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22: దేశంలో బిసిలు దుర్భర పరిస్థితి ఎదుర్కుంటున్నారని,వారిని దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్ లో బిసి బిల్లు ను ప్రవేశ పెట్టాలని రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం కన్వీనర్ లాల్ కృష్ణ ప్రసాద్ డిమాండ్ చేశారు. బిసి బిల్లు ను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టాలని శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ముందు ఉన్న అంబెడ్కర్ విగ్రహానికి బిసి ముఖ్య నాయకులు విన్నతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశంలో బిజెపి ప్రభుత్వం హయాంలో మహిళల రిజర్వేషన్ బిల్లు అమలు కావడాన్ని స్వాగతిస్తున్నామని,దానీతో పాటు బిసి బిల్లు కూడా ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు.దేశ జనాభాలో 50శాతం ఉన్న బీసీలకు న్యాయం జరగడం లేదన్నారు. మహిళ రిజర్వేషన్లలో కూడా బిసిలకు సబ్ కోటా కింద రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు.బిసిలు రాజకీయంగా ఆర్థికంగా వెనకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వచ్చే పార్లమెంట్ సెషన్ లలో తప్పక బిసి బిల్లు పెట్టేందుకు బిసిలు ఒత్తిడి చేసేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో బీసీలకు రాజకీయ పార్టీలు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు శ్రీనివాస్ ముదిరాజ్, నర్సింలు, యాదగిరి, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *