శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 14: శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్లో బిజెపి అభ్యర్థి మారబోయిన రవికుమార్ యాదవ్ ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు మంగళవారం చందానగర్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ, పీజేఆర్ స్టేడియం వద్ద బిజెపి నాయకులతో వాకర్స్ ను కలుస్తూ బిజెపి మానిఫెస్టోను వివరిస్తూ నవంబర్ 30 వ తారీఖున జరిగే ఎన్నికలలో బిజెపి పార్టీ కమలం పువ్వు గుర్తుకే ఓటు వేసి అభ్యర్థి రవికుమార్ యాదవ్ ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులతోపాటు కార్యకర్తలు పాల్గొన్నారు.
చందానగర్ డివిజన్ లో ప్రచార నిర్వహించిన బిజెపి అభ్యర్థి రవికుమార్ యాదవ్





