మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, డిసెంబర్ 09: కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు మహేశ్వరం నియోజకవర్గ డిసెంబర్ 9న సందర్బంగా సోనియా గాంధీ చిత్రపటానికి పాలభిషేకం చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణి చేశారు.ఈ సందర్బంగా పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఘనత సోనియా గాంధీ దేనని పార్టీ నాయకులు సంతోషం వెక్తం చేసారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి రఘుమారెడ్డి,మండల పార్టీ అద్యక్షుడు కాకి ఈశ్వర్,గ్రామ పార్టీ అద్యక్షుడు అల్లె కుమార్,నాయకులు అల్లె బిక్షపతి,రాజు నాయక్, ఆవుల యాదయ్య, మంత్రి అంజయ్య, బంగారుగళ్ల లాజర్, జంగయ్య, విజయ్,సేవ్యా నాయక్,శ్రీకాంత్,ఆపూరి నర్శింహ తదితరులు పాల్గొన్నారు .
ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు పాల్గొన్న పార్టీ నాయకులు





