సిద్దిపేట,ప్రజాతంత్ర, జనవరి 3: సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో సర్పంచులు కాముని ఉమేష్ చంద్ర, భట్టు లింగం, నెమలి సుభాష్, బిఆర్ఎస్ నాయకులు కోండం రవీందర్ రెడ్డి, మిట్టపల్లి గణేష్, సుంచు రమేష్ లు చదువుల తల్లి స్త్రీ జాతి విముక్తి కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త , త్యాగశీలి సావిత్రి భాయి పూలే జయంతి సందర్బంగా చిన్నకోడూర్ కేంద్రంలో సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ… సావిత్రి భాయి పూలే త్యాగాలను స్మరించుకుంటూ పురుషులతో సమానంగా స్త్రీలు చదువుకోవాలని, అంటరానితనం పోవాలని, అందరికి విద్య కావాలని కోరుతూ పాఠశాలలు స్థాపించి స్త్రీల కు చదువు చెప్పటంలో ముందు వరుసలో నిలిచారు.చదువే అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుందని, తాను విద్య నేర్చుకొని ఉపాధ్యాయురాలుగా మారి చదువు చెప్పిన మహనీయురాలు తన భర్త అయినా మాహాత్మా జ్యోతి రావు పూలే తో కలిసి సామాజిక సమానత్వం కోసం పోరాడిన త్యాగశీలి సావిత్రి భాయి పూలే అని అన్నారు. వారి ఆశయాలను ముందుకు తీసుకుపోయే అవసరం ఎంతైనా ఉందని గుర్తు చేశారు. అదే విధంగా సావిత్రి భాయి పూలే జన్మదిన రోజు బుధ వారం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం గా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు.అదేవిధంగా సావిత్రి భాయి పూలే జయంతి వర్ధంతి వేడుకలు ప్రభుత్వం అధికారికంగా జరపాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచులు తడుకమడ్ల శ్రీకాంత్, కొత్త శంకర్ ముదిరాజ్, నాయకులు గుడుమల్ల రాజలింగం, బబ్బురు బాలకృష్ణ, రాజశేఖర్ రెడ్డి, కట్కూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా సావిత్రి భాయి పూలే 193 జయంతి వేడుకలు





