ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 25 : కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ జన్మదిన వేడుకలను ఆమనగల్, తలకొండపల్లి, మాడుగుల, కడ్తాల్ మండలాల్లో ఘనంగా జరుపుకున్నారు. బి ఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు నాయకులు అభిమానులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కడ్తాల్ మండలంలోని మహేశ్వర మహా పిరమిడ్ కు తరలివచ్చారు. ఆయా మండలాల్లో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. పిరమిడ్ లో ఆయా మండలాలకు చెందిన నాయకులతో కలిసి ఎమ్మెల్యే కేక్ కట్ చేశారు. వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తల సమక్షంలో మొదటిసారిగా ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది.. అదేవిధంగా మైసిగండి గ్రామంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయా మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు నేతలు అభిమానులు ఎమ్మెల్యేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గత నాలుగేళ్లకు సంబంధించిన కల్వకుర్తి నియోజకవర్గం లో జరిగిన అభివృద్ధి పై స్క్రీన్ పై చూపించారు. ప్రజలకు వీక్షించారు. ఎమ్మెల్యే జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే సురభి వానిదేవి గువ్వల బాలరాజ్, నాగర్ కర్నూల్, రంగారెడ్డి జిల్లాల జడ్పీ చైర్పర్సన్లు తీగల అనిత రెడ్డి, శాంతకుమారి జెడ్పిటిసి జరుపుల దశరథ నాయక్, అనురాధ పత్యానాయక్, సర్పంచ్ లక్ష్మీ నరసింహ రెడ్డి, చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా, సర్పంచ్ తులసి రామ్ నాయక్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు తలకొండపల్లి మాజీ ఎంపీపీ సీఎల్ శ్రీనివాస్ యాదవ్, వీరయ్య, సయ్యద్ ఖలీల్, నాయకులు చుక్క నిరంజన్ గౌడ్, వడ్డే వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.




