కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్ట్ 21 : ప్రస్తుతం కొనసాగుతున్న కందుకూరు మండల గౌడ సంఘం కమిటీ ఉందని కొందరు కావాలని ఈనెల 20 ఆదివారం రోజు 20 మందితో కొన్ని గ్రామాల గౌడ సంఘం నాయకులు పాల్గొని నూతన సంఘ అధ్యక్షులుగా ఎన్నుకొని కమిటీకి చెడ్డ పేరు తీసుకువచ్చారని,నూతనంగా ఏన్నుకున్న గౌడ సంఘం అధ్యక్షుని ఎన్నిక చెల్లదని కందుకూరు మండల గౌడ సంఘం అధ్యక్షులు పిరాటి సిద్దేశ్వర గౌడ్ తెలిపారు. సోమవారం ఆయన కమిటీ సభ్యులతో కలిసి మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఇప్పుడు కొనసాగుతున్న కమిటీకి తెలియకుండా నూతన కమిటీ వేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.మండలంలో ఉన్న గౌడ సంఘ నాయకులకు కమిటీ సభ్యులకు తెలియజేసి నూతన సంఘాన్ని ఎన్నుకోవాల్సిన నాయకులే పక్కదారి పట్టి మరో సంఘాన్ని ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటుకు 30 గ్రామాల గౌడ కులస్తులు ఆర్థిక సహాయం అందించారని ఇట్టి విషయంపై ప్రస్తుతం ఉన్న కమిటీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు సరికొండ హరినాథ్ గౌడ్,గౌడ కులస్తులతో కలిసి అందరం కష్టపడడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.ఈ నెల 25న నేదునూరు గేటు సమీపంలో ఉన్న చందుపట్ల నరసింహారెడ్డి ఫంక్షన్ హాల్ లో మండలంలోని 30 గ్రామాల గౌడ పెద్దలను, కులస్తులను,గీతాపని వారలను ఆహ్వానించి మండల గౌడ సంక్షేమ సంఘం నూతన కమిటీని ఎన్నుకుంటామని,ఆ కమిటీని ఎన్నుకునే వరకు ప్రస్తుతం కొనసాగుతున్న గౌడ సంఘం కమిటీ పాలకవర్గం కొనసాగుతూ బాధ్యతలు నిర్వహిస్తుందని ఆయన తెలిపారు.ఈసమావేశంలో గౌడ సంఘం సభ్యులు సరికొండ వెంకటేష్ గౌడ్, గిల్లికత్తుల దేవేందర్ గౌడ్,అనెగౌని దామోదర్ గౌడ్,పల్స వెంకటేష్ గౌడ్,గడ్డమీది శివశంకర్ గౌడ్,ఇంద్రకంటి రాకేష్ గౌడ్,బూడిద సాయి కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



