ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 30 : పార్టీ పటిష్టత, బలోపేతం కోసం విధేయతగా పనిచేస్తే పదవులు దానంతటకు అవే వస్తాయని డిసిసిబి డైరెక్టర్, ఆమనగల్లు, కడ్తాల పిఎసిఎస్ చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గా నియమితులైన గోళీ శ్రీనివాస్ రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు అధ్యక్షులు జోగు వీరయ్య, చరికొండ గ్రామ టౌన్ అధ్యక్షులు జంగయ్య గౌడ్, సాభేద్, నర్సింహా, జిఎస్ఆర్ సభ్యుడు మహేష్ తదితరులు ఉన్నారు.




