గోదావరి బేసిన్‌ ‌ప్రాజెక్టులకు జలకళ

  • శ్రీరామ్‌సాగర్‌, ‌నిజాంసాగర్‌లకు పెరిగిన ప్రవాహాలు
  • రైతన్నలకు వరంగా వర్షాలు…జోరుగా వ్యవసాయ పనులు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జులై 25 : రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో గోదావరి బేసిన్‌ ‌ప్రాజెక్టు జలాశయాలు కళకళలాడుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో, రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల ఉద్ధృతిలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని ప్రాజేక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతుంది. వరద ప్రవాహాలు పెరిగాయి. శ్రీరామ్‌సాగర్‌ ‌ప్రాజెక్టుకు 1,21,008 ఇన్‌ ‌ఫ్లో ఉండగా… 882 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 90.31 టీఎంసీలకు గాను, 63.47 టీఎంసీలు నిల్వఉన్నాయి. ఇప్పటికే నిండిన నిర్మల్‌ ‌జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు 48,475 క్యూసెక్కులు, కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్‌ ‌ప్రాజెక్టులోకి 22.440 క్యూసెక్కుల వరద వొస్తుంది.

సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు ప్రస్తుతం 5.99 క్యూసెక్కుల వరద వొస్తుండగా, 385 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తుంది. జలాశయం పూర్తి స్థాయి సామర్థ్యం 29.91 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 21.48 టీఎంసీలకు చేరుకుంది. మేడిగడ్డ వద్ద లక్ష్మీ బ్యారేజీకి 5,49,210 క్యూసెక్కుల వరద వొస్తుంది. 5.49 లక్షల క్యూసెక్కుల నీటిని 75 గేట్ల ద్వారా వదులుతున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్ధాయి సామర్థ్యం 20.18 టీఎంసీలు కాగా ప్రస్తుతం 16.01 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. లోయర్‌ ‌మానేరు రిజర్వాయర్‌లో 24.07 టీఎంసీలు ప్రాజెక్టు సామర్ధ్యం ఉండగా ప్రస్తుతం 12.89 టీఎంసీల నీరు నిల్వఉంది. అదే విధంగా మిడ్‌ ‌మానేరు రిజర్వాయర్‌లో 27.50 టీఎంసీల నీటీ సామర్థ్యం ఉండగా ప్రస్తుతం 15.72 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు రైతన్నలకు వరంగా మారాయి. వ్యవసాయ పనులు జోరుగా సాగుతుండడంతో రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తున్నది. ఈ మేరకు రాష్ట్ర సమాచార పౌర సంబంధౄల శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *