మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, నవంబర్ 01:గొల్ల కుర్మ సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పిట వేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం మండలంలో మహే శ్వరం, అమీర్పేట్ గొల్ల కుర్మ యాదవ ఆత్మీయ సమ్మేళనం సభ నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి, మహేశ్వరం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ… మాట ఇస్తే తప్పనివారు గొల్ల కురుమ యాదవులని అన్నారు. గొల్ల కురుమ యాదవ సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి అండగా నిలబడలన్నారు. కుల వృత్తుల వారికి అండగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమకార్యక్రమాలు చేపట్టారని పేర్కొ న్నారు.హైదరాబాద్ మహా నగరంలో ఎకరా 100 కోట్ల ధర పలికే చోట ఆత్మగౌర భవనానికి స్థలం,5 కోట్లు కేటాయించారని గుర్తు చేసారు. గొర్రెలు మేపుకో వటానికి స్థలం మంజూరు చేయా లనే అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎన్నికలు వస్తే గ్యాస్ ధర తగ్గిస్తుందని, మళ్ళీ అయిపోగానే గ్యాస్ తో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెంచుతారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ బిఆర్ఎస్ అధికారంలోకి రాగానే 400 గ్యాస్ సీలిండర్ అందిస్తామని, మహి ళలకు 3 వేలు ప్రతి నెల అందిస్తాం అన్నారు. పంట పెట్టుబడికి రైతులకు రైతుబంధు పథకం కింద పదివేలు ఎకరాకు అందిస్తున్నట్లు మళ్ళీ అధికారం లోకి వచ్చిన వెంటనే 16 వేల వరకు పెంచి అందించబోతున్నట్లు తెలిపారు.రైతు భీమా 5 లక్షలు లాగే,93 లక్షల రేషన్ కార్డు దారులకు 5 లక్షలతో భీమాతో బతుకుకు ధీమా కల్పిస్తామని హామీ ఇచ్చారు.తెల్ల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం అందిస్తామని సంక్షేమాల ప్రభుత్వానికి అండగా నిలబడాలని కోరారు.నవంబర్ 30 న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేసారు.ఈ కార్యక్రమంలో జెడ్పీచైర్ పర్సన్ తీగల అనితారెడ్డి, యువనాయకుడు కౌశిక్ రెడ్డి ,మల్లేష్ యాదవ్,రాయప్ప కుర్మ ,పాండు యాదవ్, డైరెక్టర్ పోల్కం బాలయ్య ,మిద్దింటి బాలరాజ్, అంబయ్య యాదవ్, కర్రోళ్ల చంద్రయ్య, గుండెమోని అంజయ్య ముధిరాజ్, ఎం నవీన్, ప్రభాకర్ గొల్ల కుర్మ యాదవ నాయకులు, కార్యకర్తలు తధితరులు పాల్గొన్నారు .
గొల్ల కుర్మ సంక్షేమానికి సిఎం కెసిఆర్ పెద్ద పీట : మంత్రి సబితా ఇంద్రారెడ్డి





