తాండూరు, ప్రజాతంత్ర, జులై 26: తాండూరు మండలం కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికుల తమ సమస్యలపై గుర్రాలకు వినతి పత్రాన్ని ఇస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు, తాండూర్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు రాష్ట్ర ముఖ్యమంత్రి తో మాట్లాడి గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చొరవ చూపాలని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు పెంచాలని, ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వేతనాలు ఇచ్చి మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘం సిఐటియు జేఏసీ ఆధ్వర్యంలో జూలై 6 నుండి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మికులు మండల అధ్యక్షులు శాంతమ్మ వెంకటమ్మ జిలాని భీమయ్య జగన్ రవి నరసింహులుకిష్టప్ప బషీరాబాద్ మండల అధ్యక్షులు శ్యామప్ప నరేష్ లక్ష్మి చందు పెద్దముల్ మండల అధ్యక్షులు అం బరప్ప శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




