గురుగ్రామ్‌లో అగ్రిప్రమాదం : 50 గుడిసెలు దగ్ధం

న్యూ దిల్లీ, జనవరి 11 : హర్యానాలోని గురుగ్రాంలో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. సెక్టార్‌ 66‌లోని ఓ స్లమ్‌లో అగ్నిప్రమాదం జరగడంతో మంటలు ఎగిసిపడ్డాయి. మంటల్లో 50కి పైగా గుడిసెలు దగ్ధమయ్యాయి. స్ధానికులు సమాచారం అందించడంతో ఘటనా ప్రాంతానికి అగ్నిమాపక యంత్రాలను తరలించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిప్రమాదానికి కారణాలేమిటన్నది ఇంకా వెల్లడికాలేదు. ప్రాధమిక దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *