వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 12: దశబ్దాల ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించింది మనమే, మళ్ళీ గెలిచేది మనమే మూడోసారి ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ కావడం ఖాయమని చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం వికారాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్, చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తో కలిసి వికారాబాద్ జిల్లా కేంద్రంలోని, జిల్లా పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఎంపీ గారు మాట్లాడుతూ బాధ్యతల వారీగా ప్రతి నాయకుడు, కార్యకర్త కటోర లక్ష్యసాధనతో పనిచేద్దాం అని పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ నాయకత్వాన్ని బలపరుస్తూ భారీ మెజారిటీతో మరోసారి గెలిపించుకుందామన్నారు. బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించబోతున్నారని సీఎం కేసీఆర్ ప్రకటించబోయే మేనిఫెస్టోను చూసి ప్రతిపక్షాలు దిమ్మతిరిగి పోవాల్సిందే అని ఎంపీ రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ బూతుల వారిగా మెజార్టీ సాధించేలా స్థానిక నాయకులు బూతు ప్రతినిధులు దృష్టి సాధించి పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
గుండెల నిండా గులాబీ జెండాతో ఘనమైన విజయం సాధిద్దాం




