గణనాథులను దర్శించుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్ 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23: వినాయక నవరాత్రులు పురస్కరించుకొని అమీన్ పూర్ మండలం, అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని వివిధ కాలనీలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయా మండపాల వద్ద ఏర్పాటుచేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలను ప్రారంభించారు.అనంతరం పటేల్ గూడ గ్రామ పరిధిలోని బిఎస్ఆర్ కాలనీలో మిషన్ భగీరథ ద్వారా ఏర్పాటు చేసిన ఇంటింటికి మంచినీటి నల్ల కనెక్షన్లను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణనాథుడి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా మిషన్ భగీరథ ద్వారా నూతన కాలనీలలో శరవేగంగా మంచినీటి నల్ల కనెక్షన్లు అందిస్తున్నామని తెలిపారు.అనునిత్యం ప్రజల సంక్షేమ కోసం పాటుపడుతున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని ముచ్చటగా మూడోసారి నిండు మనస్సుతో ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమాల్లో అమీన్ పూర్ ఎంపీపీ దేవానందం, జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహా గౌడ్, పటేల్ గూడ గ్రామ సర్పంచ్ నితీశా శ్రీకాంత్, దయరా సర్పంచ్ భాస్కర్ గౌడ్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *