కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 23 : కందుకూరు మండలంలోని రాచులూరు గ్రామంలో మండల యూత్ అధ్యక్షులు దంతోజి నర్సింహాచారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం జోరందుకుంది.గడప గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,మహేశ్వరం నియోజకవర్గం లో ప్రతి మండలంలో కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతుందని కచ్చితంగా ఆరు గ్యారెంటీ పథకాలతో మహిళలు వృద్ధులు పలు వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిని అపూర్వంగా,అమోఘంగా స్వాగతం పలుకుతూ ప్రజల మనల్ని పొందుతున్నారని ఆయన పేర్కోన్నారు. నియోజకవర్గంలో ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించిన కిచ్చెన్న విజయాన్ని ఎవరు అడ్డుకోలేరని ఆయన తెలిపారు. నియోజకవర్గంలో బిజెపి బిఆర్ఎస్ కు ఇకనుండి స్థానం లేదని గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు.ప్రతి కార్యకర్త నాయకుడు కాంగ్రెస్ పార్టీ పెట్ల అభిమానంతో ఉన్నారని కెఎల్ఆర్ విజయంలో కీలక పాత్ర వహించాలని ఆయన పిలుపునిచ్చారు.
గడప గడపకు జోరందుకున్న ప్రచారం




