ఖబర్దార్ బిఆర్ఎస్ పార్టీనాయకులరా.. ఎల్లకొండ గ్రామo కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి సాధించింది : నవపేట్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కొండల్ యాదవ్

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, జులై 17: నవాబు పేట మండల పరిధిలోని ఎల్లకొండ గ్రామానికి బిఆర్ఎస్ పార్టీ చేసిందేమీ లేదని ఎల్లకొండ గ్రామానికి 80 శాతం పనులు కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసిందని నవాబుపేట్ మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొండల్ యాదవ్ సోమవారం ఎల్లకొండ గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా గ్రామసర్పంచ్ చేసిన పని ఏమిటిదో గ్రామపంచాయతీ దగ్గర గ్రామస్తుల ముందు తెలియజేయాలని ఆయన అన్నారు. ఎల్లకొండ గ్రామంలో ప్రభుత్వం పాఠశాలలు, విద్యుత్ సబ్స్టేషన్, సిసి రోడ్లు, డ్రైనేజీలు, ఇందిరమ్మ ఇండ్లు, మూడు వాటర్ ట్యాంకులు ఇది నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా, తొమ్మిది సంవత్సరాల నుండి బిఆర్ఎస్ పార్టీ చేసింది ఏమిటిదో ఆ పనిని చూపించాలని కొండల్ యాదవ్ పేర్కొన్నారు. గ్రామంలో బి ఆర్ఎస్ పార్టీ చేసిన పని మిషన్ భగీరథ నల్ల కలెక్షన్,టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎదుగుదల తప్ప ప్రజలకు కావాల్సిన పనులు ఏమీ లేవంటూ ఆయన అన్నారు. గతంలో పార్వతి పరమేశ్వరులను టెంపుల్ కు నిధులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ కాదా, గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు 150 నుండి 200 వరకు ఇంటిచ్చిన ఘనత కాదా అని ప్రశ్నించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉన్నప్పుడు పచ్చదనం పరిశుభ్రత చేసింది కాంగ్రెస్ కాదా అని అన్నారు. టిఆర్ఎస్ పార్టీ చేసింది ఏమిటో చెప్పగలవా అంటూ గ్రామ సర్పంచ్ రావు గారి వెంకట్ రెడ్డికి సవాల్ విసిరారు. గ్రామంలో ఎక్కడ సమస్యలు అక్కడే ఉంటూ ప్రజలు తీవ్ర ఆవేదన చెందిన గ్రామ సర్పంచ్కు మాత్రం నాకేం పట్టదన్నట్లు కల్లబొల్లి మాటలతో ఎవరు అడిగితే వారిని ఇష్టమొచ్చినట్టు బూతులతో తిట్టి పారిస్తుండు అని పేర్కొన్నారు. స్థానిక సర్పంచ్ వెంకటరెడ్డికి స్థానిక ఎమ్మెల్యే యాదయ్య అన్న దండాలు ఉండటంతో ఇష్టం వచ్చినట్లు విర్రవీగుతూ బూతులు తిడుతూ నాలుకలు కోస్తే ఇస్తానని హెచ్చరికలు జారీ చేయడం సరైంది కాదన్నారు. గ్రామంలో డ్రైనేజీ లేక తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. ఎస్సి, బిసి కాలనీలో పైపులు వేశాడు గుంతలు మోయడం మరిచాడు అని పేర్కొన్నారు. గ్రామస్తుల అడిగితే నువ్వు ఎవరు నన్ను అనడానికి నేను గ్రామ సర్పంచ్న అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. గ్రామ రెవెన్యూ పరిధిలో కోట్ల పరిధిలోని భూములు పోతుంటే కొన్న వారి దగ్గర నుండి లక్షలు గుంజే విధంగా చేస్తున్నాడు అని విమర్శించారు. గ్రామ రెవెన్యూ పరిధిలో 10నుండి 20వరకు వెంచర్లు నిర్మిస్తున్న సందర్భంగా వారి దగ్గర లక్షల గుంజి సర్పంచి ఇంట్లో కుప్పలు పోసుకుంటున్న రావు గారి వెంకటరెడ్డి అన్నారు. వెంచర్ల నుంచి తెచ్చిన డబ్బులను మై తాప్కాన్ గూడ వెళ్లే దారిలో నిర్మించారు అని పేర్కొన్నారు. ఆ మందిరం కి పెట్టిన డబ్బులు ఎక్కడివి దాదాపుగా 30 నుండి 40 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ఆ మందిరాన్ని నా సొంతంగా నేనే నిర్మించాలని గొప్పోలు చెప్పుకోవడం సిగ్గు చేటు అంటున్న వార్డ్ మెంబర్లు, గ్రామ పరిధిలోని 9వ వార్డులో డ్రైనేజీ పనులు ప్రారంభించి గత రెండు నెలలు అవుతున్న ఆ పనులు ఎందుకు పూర్తి కావడం లేదు ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఎక్కడికి వెళ్లాయి ఆ పనులు ఎప్పుడు పూర్తి చేస్తావని కావలి పావని పరమేష్అడగగా మీరెవరురా నా పని నా ఇష్టం అంటూ చేస్తాను చేయను ఎవరికి చెప్పుకుంటారు చెప్పుకోండి ఏమి చేస్తారు అని సభ్యురాలు పావని భర్తను పరమేష్ ని ఇష్టం వచ్చిన బూతు మాటలు తిట్టి నాడు అని తెలియజేశారు. గ్రామపంచాయతీలో ముగ్గురు మెంబర్లను మీరు ఎవరు మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్లు నా దగ్గరికి రావద్దు నాతో మాట్లాడడానికి మీరు ఎవడ్రా అంటూ 8వ వార్డ్ మెంబర్ కుంతియా బేగం కుమారుని ఇష్టం వచ్చిన బూతు మాటలు తిట్టిసాగాడు. మరియు ఆయనతోపాటు మూడవ వార్డ్ నెంబర్ హాయ్ మధు ను అమ్మ అయ్య అంటూ బూతు మాటలతో తిడుతూ ఉంటే క్రితం ఈ ముగ్గురు వన్ మెంబర్లు బి ఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ పోరాటంలో హైమద్ అనే యువకుడు పోరాడి తెలంగాణ రావడానికి హాయ్ కష్టాలు పడ్డాడు వారిని టిఆర్ఎస్ పార్ట కార్యకర్త కావు నీవు కాంగ్రెస్ కార్యకర్తలని ఆ ముగ్గురిని ఎలాన చేసిన ఘనత సర్పంచ్ వెంకటరెడ్డి అని వారు ఆవేదన చెందుతున్నారు. వెంటనే గ్రామస్తులు హాజరై పనులని కాంగ్రెస్ పార్టీ వినని టిఆర్ఎస్ పార్టీ చేసింది ఏమీ లేదని వచ్చిన డబ్బులు తినడమే నాయకులు పని అని గ్రామస్తులు అంటున్నారు. మూడవ వార్డు నెంబర్ హైముద్దీన్ గత సంవత్సరం మైనింగ్ డబ్బులు ఏమైనవి అని గ్రామ సర్పంచ్ ని వివరణ అడగగా నువ్ ఏందిరా నన్ను అనడానికి నీకేం చెప్పేది అంటూ బూతు మాటలు తిట్టేసాగాడు. గ్రామంలో రెవెన్యూ పట్టా భూమి ఎవరు 11 లో నుండి నన్ను రెండు ఎకరాల వరకు అమ్ముకున్న వారి దగ్గర 10 లక్షల రూపాయల నుండి 30 లక్షల వరకు తీసుకున్నాడని మెంబర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖబర్దార్ వెంకటరెడ్డి నీకు దమ్ముంటే పంచాయతీ కార్యాలయం వద్ద నువ్వు ఖర్చుపెట్టిన లెక్కలు గ్రామస్తులకు చెప్పు లేదంటేకర్ర ఎర్రగా కర్రు కాల్చి ప్రజల ముందు వాతలు పెట్టే రోజులు వస్తాయి తస్మా అంటూ గ్రామం పంచాయతీ వార్డు మెంబర్లు అంటున్నారు. గతంలోని మర్చిపోయావా నీ స్తోమత ఎక్కడ నీవే టు మైదిపట్నంలో మార్కెట్ దందా ను గుర్తుతెచ్చుక గ్రామస్తులను నుండి గ్రామం ప్రజలు ఉందో లేకుండ కొంత భూమి అమ్ముకుంటే పరిచయం చేసి పరంగా లక్షల గుంజుకున్న ఘనత నీదే ఆ డబ్బులతో సంపాదించావు నీవు చెమట ఓర్చి కష్టపడ్డ డబ్బులు కావు గ్రామం ముంచిన డబ్బులు వచ్చే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అందులో నీ అంతు తెలుస్తుంది ఖబర్దార్ అంటూ కాంగ్రెస్ పార్టీగ్రామ అధ్యక్షుడు శివకుమార్ అన్నారు. గ్రామంలోని పార్వతి పరమేశ్వరుల గుట్ట ఎక్కడానికి రోడ్డు నిర్మించింది కాంగ్రెస్ పార్టీ కాదా పూర్తి పనులు చేయడానికి 35 లక్షలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా ఆ డబ్బులు స్థానిక ఎమ్మెల్యే ఖాలే యాదయ్య తిరుమల తిరుపతి దేవస్థానం మెంబర్గా ఉండిన సమయంలో ఆ డబ్బులు కాంగ్రెస్ పార్టీ కావా అంటూ విమర్శించారు. ఇన్ని విధాల పనువర్జేషన్ కాంగ్రెస్ పార్టీని తిట్టడం న్యాయమైన అంటూ బి ఆర్ఎస్ నాయకుల పై ఆవేదన చేస్తున్నారు. ఈ కార్యక్రమం లో గ్రామం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, శివకుమార్, కార్యకర్తలు, జంగయ్య, నర్సింలు, ప్రవీణ్, తిరుపతి రెడ్డి, శ్రీనివాస్, కుమార్, రామచంద్రయ్య పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *