సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిద్దిపేటలో సర్వా పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా మన విగ్రహానికి పూలమానం చేసి మాట్లాడుతూ కాలం కత్తి దువ్వితే సమరం కూడ సంకొచిస్తుంది అనడానికి నిలువెత్తు నిదర్శనం పాపన్న అధికారం అని ఆలోచన చెయ్యడమె కష్టమనే రోజుల్లో దొరల నిరంకుశత్వానికి 370సంవత్సరాల క్రితమే బహుజనుల కోసం గీతకత్తి వదిలి యుద్దఖడ్గం, బళ్ళెం, డాలు చేతబట్టి వీరోచిత యుద్దం చేసి ఎదురు తిరిగి గెలిచి నిలిచిన మహనీయుడు పాపన్నసాధించిన విజయాలకు చెరగని మౌనముద్ర, చెరగని సంతకం, ఖిలషాపుర్ కోట, భువనగిరి కోట, ఓరుగల్లు కోట, గోల్కొండ కోట. సర్వాయి పేట ఇలా 33 కోటల రారాజు సర్దార్ సర్వయి పాపన్న గౌడ్ మహరాజ్ ఏలిన కోటలు.మొగలాయిల వెన్నులో వణుకు తెప్పించిన గోప్ప గెరిల్లా యుద్ద నైపుణ్య యోధుడు పాపన్న, మొదటగా 12 మందితో మొదలైన అతికొద్ది రోజుల్లోనే 12వేల సైన్యం తయారుచేసుకొని గోల్కొండ కోటను సైతం 7 మాసల పైగా ఏలిన రారాజు పాపన్న.చరిత్రలో చోటు లేకపోవచ్చు కాని బహుజనుల కళాకారులను ఆదుకున్నడు కనుకనే, వారిని ఆదరించాడు కనుకనే జానపదులలో పాపన్న జీవితంని ప్రజలు హృదయంలో కళ రూపంలో నిక్షిప్తం చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ సెల్ వైస్ చైర్మన్ ఎంజి ఖలీముద్దీన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శంకర్ గౌడ్, పిసిసి మాజీ సభ్యులు దాస అంజయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మార్క సతీష్ గౌడ్, మల్లేశం పాల్గొన్నారు.



