హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 14 : క్రైస్తవుల అభివృద్ధికి కట్టుబడి వారి సంక్షేమం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చిన రాజకీయ పార్టీలలకే రానున్న ఎన్నికల్లో తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, ఆ పార్టీలకే ఓట్లు వేసి గెలిపిస్తామని వాయిస్ అఫ్ క్రిస్టియన్ యూనిటీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ సాధు సత్యనాథ్ అన్నారు. ఈ మేరకు మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శాంతి కామికులైన క్రైస్తవ సేవకులపై రోజు, రోజుకు పెరిగిపోతున్న మాతోన్మాద శక్తుల దాడులను, అక్రమ అరెస్టులను అరికట్టాలని అన్నారు. క్రైస్తవుల సమస్యలపై స్పందించే నాధుడే లేడన్నారు. క్రిస్టియన్ మైనారిటీస్ కు ఏ రంగంలో ప్రాధాన్యత రిజర్వేషన్స్ లేవన్నారు. రాజకీయ రంగంలో కార్పొరేటర్లు, ఎమ్మెల్యే, ఎంపీలు లేరని అన్నారు. ఏపీలో మాదిరిగా పాస్టర్లకు హెల్త్ కార్డులు, డబ్బులు బెడ్ రూమ్ ఇళ్లతో పాటు రూ.5 వేల గౌరవ వేతనం ఇచ్చి ప్రత్యేక రక్షణ కల్పించాలన్నారు. అదేవిదంగా రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవుల సమాధుల కోసం స్థలాలు కేటాయించాలని అన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ రాధా మాథ్యూస్, డాక్టర్ సుక్క డానియల్, బిషప్ ఆనంద్ కుమార్, ఆడం రాజ్, కన్నా డానియల్, గిడియోను తదితరులు పాల్గొన్నారు.
క్రైస్తవుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న పార్టీలకే మద్దతు





