క్రాస్ బ్రౌ షూటింగ్ లో పథకాలు సాధించి రాష్ట్రానికి వన్నె తెచ్చిన క్రీడాకారులను సన్మానించిన మంత్రి సబితారెడ్డి

కందుకూరు, ప్రజాతంత్ర, జూలై 26 : క్రాస్ బ్రౌ షూటింగ్ లో పథకాలు సాదించి రాష్ట్రానికి వన్నె తెచ్చిన క్రీడాకారులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి సన్మానించారు.బుధవారం జైత్వారం ఎంపిటిసి గుండాల సురేష్ ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డిని క్రాస్బో షూటింగ్ తెలంగాణచాంపియన్ షిప్ లో మెడల్స్ పొందిన క్రీడాకారులను పరిచయం చేశారు.శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ,క్రాస్బో షూటింగ్ తెలంగాణచాంపియన్ షిప్ లో మెడల్స్ పొందిన క్రీడాకారులు 7 స్వర్ణలు,4 రజతాలు,5 కాంస్య పతకాలు సాధించి తెలంగాణ రాష్ట్రానికి వన్నె తెచ్చారని మంత్రి కొనియాడారు.ఈసందర్బంగా తెలంగాణ క్రాస్ బౌ షూటింగ్ అసోసియేషన్ ఆధ్యక్షులు లక్ష్మీ చైతన్య, ప్రధాన కార్యదర్శి వసంత మాధురి ఆనందం వ్యక్తం చేసారు.ఈ పోటీలో తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా నుండి కందుకూరు మండలం,బాచుపల్లి గ్రామానికి చెందిన మల్లగాళ్ల మహేందర్ యు/30 కేటగిరిలో కాంస్య పథకం సాధించడం అభినందనియమన్నారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు నరేష్,క్రీడాకారులు తదితరులు పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *