కోలుకుంటున్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13 : ఇటీవల తన ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బాత్‌ రూమ్‌లో జారి పడి కాలికి గాయమయి, సోమాజీగూడ యశోదా హాస్పిటల్‌లో సర్జరీ అనంతరం చికిత్స పొందుతున్న మాసి సిఎం, బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ మ్రంగా కోటుకుంటున్నారు.

తాను త్వరగా కోలుకుని త్వరలోనే ప్రజల మధ్యకు వొస్తానని, తనను చూడడానికి ప్రజలు అధిక సంఖ్యలో రావొద్దని కూడా ఆయన తన వీడియో సందేశంలో పార్టీ నేతలకు, అభిమానులకు విజ్ఞ ప్తి చేసిన విషయం తెలిసిందే. కాగా ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, పూర్తిగా కోలుకోవడానికి రెండు నుంచి మూడు నెలల సమయం పట్టవొచ్చని వైద్యులు ఇదివరకే తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *