15వ రాష్ట్రపతిగా ద్రౌపతి ముర్ము ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందలు తెలుపుతూనే రాజ్యాంగ హక్కుల పరిరక్షణ, ధర్మ పాలనతో పదవికి శోభ తేవాలని ఆశిస్తున్నాం. మునుపెన్నడు లేని రీతిలో రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన, అక్రమ కేసులు, ప్రతిపక్షాలపై ఈడి దాడులు, ఆదివాసి, దళితులపై దాడులు ద్రౌపతి ముర్ము దేశ మొదటి పౌరులుగా సమ్మతించక, కేంద్ర ప్రభుత్వానికి సరి అయిన సూచనలు ఇవ్వాలని ఆశిస్తున్నాం. 15 మంది రాష్ట్రపతులు కేవలం ముగ్గురు, నలుగురిని పోల్చుతూ, అందరూ రబ్బర్ స్టాంప్ రాష్ట్రపతులుగా ఉండాల్సందేనని తీర్మానించడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని కోల్పోవడమే. నూతన పార్లమెంట్ భవనంపై జాతీయ చిహ్నం అశోకుడి నాలుగు సింహాల రీతిలో మార్పులను కొద్ది మార్పు – పెద్ద సందేశం లాంటి ట్విట్టర్‌తో రాష్ట్రపతి పదవిని దిగజార్చవద్దని, ఈ వారి ఎన్నిక తరువాత అంబేడ్కర్‌కు నివాళులు అర్పించి ఆ బాటలో కొనసాగుతామనే సందేశాన్ని విడువొద్దని కోరుతున్నాం.
అనేక ప్రజాస్వామిక విలువలను కారాచినా, రాజకీయ వ్యూహంలో సోషల్ ఇంజనీరింగ్‌లో భాగంగా బి.జె.పి ద్రౌపతి ముర్మును రాష్ట్రపతిని చేసి మరో స్త్రీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఈ డి ముందు హజరు పరచి, వేధింపులకు గురిచేసి గొప్ప పని చేసినట్లుగా ప్రచారం చేసుకోవడం దురదృష్టకరం. ఉపరాష్ట్రపతిగా మార్గరెట్ అల్వాను కాంగ్రెస్ ప్రతిపాదిస్తే మద్దతు తెలిపిన టి.ఆర్.యస్ సోనియాగాంధీ పై ఈ డి వేధింపులను ఖండించడం ఆహ్వానించదగిన పరిణామం. కేరళ రాష్ట్రంలో యుడిఫ్, ఎల్ డిఎఫ్ తీరుగా రాష్ట్రాల్లో ఎంత తీవ్రంగా వైరి పక్షాలుగా తలపడినా, అంశాలవారీగా కేంద్రంపై పోరాడడం అవసరమని గుర్తు చేస్తున్నాం.
బి.జె.పి మైండ్‌గేమ్ కోసం, ఫెడరల్ స్ఫూర్తిని ప్రజల హక్కుల్ని కాపాడే ఉమ్మడి ప్రణాళికలో విరుద్దపక్షాలుగా మోహరించవలసిన అవసరం లేదు.కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ఏనాడు అభ్యంతరాలు చెప్పి లక్షకోట్ల వృధా కాకుండా ఆపక, ఇప్పుడు పారదర్శక లేదని, జాతీయ ప్రాజెక్ట్ హోదా సాధ్యం కాదని తేల్చడం తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసినట్లే అవుతుంది.బిజెపి వింత ప్రయోగాల్లో ముర్ము ప్రయోగం తరువాత ప్రతిపక్షాలు చాలా నేర్చుకోవలసి
ఉన్నది.
– డా.చెరుకు సుధాకర్
తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు




