- గెస్ట్ లెక్చరర్స్‌కు ఇచ్చిన హామీ ఏమైంది..?
- పిఎస్‌లో గెస్ట్ లెక్చరర్స్‌ను బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్ పరామర్శ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 25 : సీఎం కేసీఆర్ ఎక్కడ ఉపన్యాసం ఇచ్చినా అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడటం లేదని హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా గెస్ట్ లెక్చరర్స్‌కు ఇచ్చిన హావి• ఏమైందని ఆయన సీఎంని ప్రశ్నించారు. ఇంటర్మీడియట్ బోర్డు ముట్టడికి యత్నించిన గెస్ట్ లెక్చరర్స్ అరెస్టుపై ఈటల మండిపడ్డారు. అరెస్టు అయిన గెస్ట్ లెక్చరర్స్‌ని ముషీరాబాద్ పీఎస్‌లో పరామర్శించిన ఈటల.. ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. తక్షణమే వారిని విడిచి పెట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విడియా సమావేశంలో ఈటల మాట్లాడుతూ…రాష్ట్రంలో పదేళ్ల నుంచి గెస్ట్ లెక్చరర్స్‌గా పని చేస్తున్న తమను రెన్యువల్ చేయాలని వారు హైకోర్టుకు వెళ్లారని, హైకోర్టు తీర్పును కూడా సీఎం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
సెలవులు వొస్తే వారికి జీతాలు రావని, వారికి ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు పన్నెండు నెలల జీతాలు ఇవ్వాలని ఈటల డిమాండ్ చేశారు. కేసీఆర్‌ను ప్రశ్నించినా..అడ్డుకున్నా సహించరని అన్నారు. కేసీఆర్ భూముల వి•ద కన్నేశారని, అందుకే వీఆర్‌ఏలు సమ్మె చేస్తే ఉక్కుపాదం మోపారని, ఇప్పుడు వీఆర్‌ఏ వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించారు ఈటల. గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ప్రొబేషన్ పీరియడ్ మూడేళ్లు పెట్టిన కేసీఆర్..మరో సంవత్సరం పెంచి నాలుగేళ్లు చేయడం దుర్మార్గమన్నారు. ఇప్పటికీ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్య పరిష్కారం కాలేదని ఈటల మండిపడ్డారు.




