శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కర్ణాటక మాజీ మంత్రి ఎమ్మెల్యే మునిరత్నం నాయుడు అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ప్రవాస్ యోజనలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి లో గల ఎస్.ఆర్. కన్వెన్షన్ హాల్ లో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన గచ్చిబౌలి డివిజన్ శక్తి కేంద్రాల ఇన్చార్జిలు, మరియు బూత్ అధ్యక్షులు సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ ,శేరిలింగంపల్లి నియోజకవర్గ కన్వీనర్ రాఘవేంద్ర రావు ల తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్ణాటక మాజీ మంత్రి,ఎమ్మెల్యే మునిరత్న నాయుడు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. రెండు ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అనేక హామీలను ఇచ్చి అమలు చేయలేదని, అమలు చేస్తున్న ఆయా పథకాలను అంతంత మాత్రమే అందజేసి మళ్లీ ఇప్పుడు ఎన్నికల ముందు అనేక హామీలను ఇచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు కేసిఆర్ కుట్ర పన్నుతున్నారని, ప్రజలు ఇది గమనించి వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలు సాధిస్తామని చెప్పి కేసీఆర్ అధికారంలోకి వచ్చారని, నేడు వాటిని తుంగలో తొక్కారని ఆరోపించారు. దళిత బంధు పూర్తి స్థాయిలో అమలు లేదని, గిరిజన బంధు లేదని, మూడెకరాలు ఊసే లేదన్నారు. గిరిజనులు ఆడపిల్లలు అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజల కలలు కల్లలు చేశారని, అబద్ధాలతో కాలయాపన చేస్తున్నారన్నారు. కుటుంబ, అవినీతి కెసిఆర్ పాలన అంతమొందించేందుకు, అధికారమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. అనంతరం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ గచ్చిబౌలి డివిజన్ పరిధి లోనీ ప్రతి పోలింగ్ బూత్,కమిటీ ,శక్తి కేంద్రాలను మరింత పటిష్టం చేయాలన్నారు.కెసిఆర్ పాలన తో విసిగిపోయారని,ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్ని అన్నారు.అందుకే రాష్ట్రంలో బిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగిన బిజెపి వైపు ప్రజలంతా చూస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ పరిధిలోనీ రాష్ట్ర నాయకులు,జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు,బూత్ ఇంచార్జిలు,బూత్ కమిటీ అధ్యక్షులు,శక్తి కేంద్రల ఇంచార్జిలు,డివిజన్ నాయకులు,బీజేవైఎం నాయకులు, యువ మోర్చా నాయకులు , మహిళా మోర్చా నాయకులు , కిసాన్ మోర్చా నాయకులు , ఎస్సీ మోర్చా నాయకులు ,ఎస్టి మోర్చా నాయకులు, మహిళా నాయకులు,కార్యకర్తలు,పెద్దసంఖ్ యలో పాల్గొన్నారు.




