కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన సేవాలాల్ సేన రాష్ట్ర కమిటి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 28 : తాము అధికారంలోకి వస్తే లంబాడీల ఆరాధ్య దైవం సంత్ శ్రీశ్రీశ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి ఫిభ్రవరి 15 న అధికారికంగా సేలవు దినం ఇస్తామని సీఎం ఆందోల్ ఎన్నికల ప్రచార సభలో ప్రకటించిన నేపథ్యంలో కెసిఆర్ కు రాష్ట్రంలో ఉన్న యావత్ గిరిజనుల పక్షాన, సేవాలాల్ సేన రాష్ట్ర కమిటి పక్షాన కృతజ్ఞత తెలుపుతున్నామని సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు ఆంగోతు రాంబాయి నాయక్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఎర్పాటు చేసిన మిడియా సమావేశంలో రాంబాబు నాయక్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పేట్టుకొని గత నెలలో సేవాలాల్ సేన విడుదల చేసిన గిరిజన డిక్లరేషన్ ను అన్ని రాజకీయ పార్టీలకు తమ తమ మేనిఫేస్టోలో చేర్చి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పరిష్కరించాలని కొరినట్లు తెలిపారు. అందులో భాగంగానే బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 24న ప్రగతి భవన్ కు అహ్వానించగా డిక్లరేషన్ లో ఉన్న అంశాలను, డిమాండ్ల మీద చర్చించామన్నారు. కెసీఆర్ దృష్టికి తీసుకేళ్ళి డిమాండ్లను పరిష్కరిస్తానని కెటిఆర్ హామి ఇచ్చినట్లు తెలిపారు. ఈ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ రఘురామ్ రాథోడ్, ఉపాధ్యక్షులు వర్తె రేఖ్యనాయక్, డి.పరుశరామ్ నాయక్, జిల్లా అధ్యక్షులు ఎల్. మోహన్ నాయక్, గ్రేటర్ అధ్యక్షులు కళ్యాణ్ నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ శివ నాయక్, లఘుపతి నాయక్, రవితేజ నాయక్, రమేష్ నాయక్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *