మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర, జూలై 23 : కుల,చేతి వృత్తుల దారులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రశేఖర్ రావు అండగా నిలిచారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిదిలో మంఖల్ 7 వార్డు 30 లక్షలు వ్యయంతో నిర్మించనున్న యాదవ్ సంఘం,గౌడ్ సంఘం కమ్యూనిటి భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఒక్కోక కులానికి ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తూ గౌడ,యాదవ కులస్తులకు కూడా కొకపేట ప్రాంతంలో ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నారన్నారు.అదేవిధంగా రైతన్నల లాగే,గౌడన్నలకు 5 లక్షల రూపాయల ప్రమాద భీమా సౌకర్యం కల్పించారన్నారు. ఎక్కడికో వెళ్లి గియకుండా,గౌడన్నలకు దగ్గరగా ఉండాలనే చెరువు కట్ట మీద ఈత చెట్లు పెట్టినట్లు,వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత సొసైటీలకే ఉందన్నారు.ఆదాయం పెంచుకోవాలని మంత్రి సూచించారు.గొల్ల,కురుమలకు పెద్ద ఎత్తున గొర్రెలను పంపిణీ చేస్తూన్నారని అన్నారు.కుల వృత్తుల వారికి అండగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు.నాడు భయం భయంగా ప్రభుత్వాల ఆంక్షల మధ్య కల్లు అమ్ముకునేవారని,నేడు నగరం నడి బొడ్డున నీరా కేఫ్ లు పెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా ఉంటున్నారన్నారు..బీసీ ల్లోని కుల చేతి వృత్తుల వారికి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల సహాయం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వికలాంగులకు ఆగస్టు నుండి 4 వేల పెన్షన్ అందిస్తున్నట్లు,ఆసరా పెన్షన్లు 200 నుండి 2 వేలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు. 25 కోట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తుక్కుగూడ మునిసిపాలిటీకి ఇచ్చారని,వాటితో స్థానిక ప్రజల అవసరాలు తీర్చటానికి కృషి చేస్తానని,స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. మంఖల్ లో ప్రభుత్వ దవాఖాన ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు.ఈ ప్రాంతంలో రజక సోదరులకు ధోభీ ఘాట్ నిర్మిస్తామని మంత్రి అన్నారు. స్థానిక నిరుద్యోగ యువత కు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేలా కృషి చేస్తామన్నారు. ఫాక్స్ కాన్ సంస్థ 9 నెలల్లో ప్రారంభం కానుందని, లక్ష మందికి ఉపాధి లభిస్తుందని,స్థానిక యువతకు అవకాశాలు లభిస్తాయన్నారు.ఈ ప్రాంతం వరకు మెట్రో ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలిపారని,తద్వారా ఈ ప్రాంతం రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.


