కులాల పేరిట ప్రశాంతతను చెడగొడితే కఠిన చర్యలు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6:స్వేచ్ఛాయుత రాజకీయాలకు ప్రతీక పటాన్ చెరు నియోజకవర్గమని, కులాల పేరిట విభజన రాజకీయాలు చేస్తూ ప్రశాంతతను చెడగొడితే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ భావ ప్రకటన స్వేచ్చ  ఉంటుందని, దాన్ని హరించే హక్కు ఎవరికీ లేదని అన్నారు. పటాన్ చెరు నియోజకవర్గం జిన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగంపేట  గ్రామంలో పురుగుల మందు తాగి  ఆత్మహత్య యత్నానికి పాల్పడి, పటాన్ చెరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుమ్మరి భాస్కర్ ను బుధవారం ఎమ్మెల్యే జిఎంఆర్ పరామర్శించారు. వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు అనుచరులు ఎన్ఎంఆర్ యువసేన పేరుతో బీసీ సామాజిక వర్గం నిరుపేద కుటుంబానికి చెందిన కుమ్మరి భాస్కర్ ను ఇంటి నుండి బయటకు పిలిచి, అసభ్య పదజాలంతో దూషిస్తూ బెదిరింపులకు పాల్పడడం సిగ్గుచేటు అన్నారు. తీవ్ర అవమానానికి గురైన భాస్కర్ పురుగులమందుతాగిఆత్మ హత్యాయత్నానికి  పాల్పడడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తి ఆత్మహత్యకు ప్రేరేపించేలా బహిరంగంగా దూషించి అవమానించండం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. భాస్కర్ కు బిఆర్ఎస్ పార్టీ తరపున అండగా ఉంటామని  తెలిపారు.భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, గ్రామ సర్పంచ్ ప్రశాంతి నరేందర్, పార్టీ మండల అధ్యక్షుడు రాజేష్, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *