కులవృత్తుల సంక్షేమానికి పెద్ద పీట

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 25:  తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేశారని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు పట్టణంలోని ముదిరాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన ముదిరాజుల సంక్షేమ సంఘం ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉనికి కోల్పోతున్న ప్రవృత్తులకు సీఎం కేసీఆర్ జీవం పోశారని అన్నారు. ప్రత్యేకంగా కార్పొరేషన్ లో ఏర్పాటు చేసి నిధులు కేటాయించి ఆర్థిక అభివృద్ధికి పాటుపడ్డారని తెలిపారు. నవంబర్ 30న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి బిఆర్ ఎస్ విజయానికి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు సపాన దేవ్, శంకర్ యాదవ్, నాగసాని మాణిక్యం, అఫ్జల్, నివర్తి దేవ్, జగన్, రాము, రాజు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *