ప్రజాతంత్ర, నవంబర్ 20 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో శివసేన బలపరిచిన అభ్యర్థి లక్ష్మణ్ నామినేషన్ వేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా నామినేషన్ వేసిన నాలుగు రోజులకు లక్ష్మణ్ మాతృమూర్తి భారతి బాయ్ పరమపదించారు. ఆయన కన్నతల్లి మరణించడంతో మనస్థాపానికి గురయ్యానని ఎమ్మెల్యే అభ్యర్థికి విత్ డ్రా చేసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. శివసేన తెలంగాణ పార్టీ ఆదేశాల మేరకు ఆయన వెంట ఉన్న కార్యకర్తలకు రెండు మూడు రోజుల్లో ఏ పార్టీకి మద్దతు తెలిపే విషయం తెలియజేస్తామని తెలిపారు. నిరంతరం ప్రజలకు సేవ చేయడానికి అందుబాటులో ఉంటానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో హీరాలాల్, సిద్దు, కాళిదాస్, విశాల్, షిండే, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్ శివసేన ఎమ్మెల్యే అభ్యర్థి విత్ డ్రా





