కిచ్చన్నగారి లక్ష్మారెడ్డిని ను భారీ మెజారిటీతో గెలిపిస్తాం

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 10: మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేపా భాస్కర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణా పురం డివిజన్ హరిపూరి కాలనీలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేఎల్ఆర్ భారీ మెజారిటీతో విజయం సాధిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు బిఅర్ఎస్ పార్టీ తీవ్ర వ్యతిరేకతో ఉన్నారని, రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి, తలాటి రమేష్ నేత, శైలేజ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *