- చుక్క నీరు పారకున్నా నిధుల దుబారా
- కాంగ్రెస్ సృష్టించిన సంపదను అమ్ముకుంటున్న కెసిఆర్
- డియా సమావేశంలో సిఎల్పీ నేత భట్టి విమర్శలు
హైదరాబాద్,ప్రజాతంత్ర,మార్చి
దేశాన్ని బీజేపీ మత ప్రాతిపదికన విడదీస్తోందని విమర్శించారు. అదానీకి ప్రధాని మోదీ పంచిన సొమ్ముపై హిండెన్‌బర్గ్ రిపోర్ట్ ఇచ్చిందని ఆయన తెలిపారు. ఇకపోతే రాష్టాన్రికి బీఆర్‌ఎస్ ప్రమాదకరంగా మారిందని అన్నారు. కాళేశ్వరం కట్టి లక్షల కోట్లు తిన్నారని.. ప్రాజెక్టు నుంచి చుక్క నీరు పారలేదని వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టుకు కాల్వలు తవ్వకుండా నీళ్లు ఎట్ల ఇస్తరని ప్రశ్నించారు. కృష్ణా నదిపై పాలమూరు తప్ప కొత్త ప్రాజెక్టేది అని నిలదీశారు. అన్నీ కూడా కాంగ్రెస్ కట్టినవే అని ఆయన అన్నారు. కాంగ్రెస్ సృష్టించిన సంపదతోనే హైదరాబాద్‌లో భూముల రేట్లు పెరిగాయని.. కానీ ఇప్పుడు బీఆర్‌ఎస్ ప్రభుత్వం వాటిని కూడా అమ్మేస్తోందన్నారు. 24 గంటల కరెంట్ ఇస్తున్నామని గొప్పలు చెబుతున్నారని.. కానీ కాంగ్రెస్ కట్టిన కరెంట్ ప్రాజెక్టులతోనే సాధ్యమవుతోందని తెలిపారు. బీఆర్‌ఎస్ కట్టిన కొత్త ప్రాజెక్టు ఒక్కటి కూడా లేదని భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు.



