ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్ 9: బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా నామినేషన్ వేసిన చేవెళ్ల ముద్దు బిడ్డ, అభివృద్ధి సూర్యుడు కాలే యాదయ్య,వెంట మంత్రి పట్నం మహేందర్ రెడ్డి,చేవెళ్ల నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జి పట్లోళ్ల కార్తీక్ రెడ్డి పాల్గొన్నారు. భారీ ర్యాలీగా షాబాద్ చౌరస్తా నుండి గులాభీ దళం కదిలింది. నియోజకవర్గ వ్యాప్తంగా నాయకులు,మహిళా నాయకురాళ్లు,కార్యకర్తలు, అభిమానులు,సంక్షేమ సంఘాలు, తమ తమ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున నామినేషన్ ర్యాలీలో పాల్గొని కారు గుర్తుకే మన ఓటు అంటూ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ..
రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది మూడవసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను గెలిపించుకోవాలన్నారు.చేవెళ్ల నుండి యాదయ్య మూడోసారిగా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలన్నారు.యాదయ్యను మీ బిడ్డగా కడుపులో పెట్టుకొని భారీ మెజారిటీతో గెలిపించాలని చేవెళ్ల ప్రజలకు పిలుపునిచ్చిన మంత్రి పట్నం మహేందర్ రెడ్డి.ఈ కార్యక్రమంలో కార్తీక్ రెడ్డి మాట్లాడుతు..చేవెళ్ల పౌరుశాల గడ్డ చేవెళ్ల పౌరుషం దెబ్బకు కాంగ్రెస్ బీజేపీ,పార్టీలు,గలంతు కావలన్నారు..పాల లాంటి మనసు వున్న యాదన్న కావాలా ఆయుధాలు సరఫరా చేసే క్రిమినల్స్ కావాలా చేవెళ్ల ప్రజలు ఆలోచన చెయ్యాలన్నారు.భారీ మెజార్టీతో మరో సారి యాదన్నను గెలిచుకుందాం అని చేవెళ్ల ప్రజలకు పిలుపనిచ్చారు.కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఎందుకు ఆలస్యం జరిగింది.సర్పంచ్ ఎన్నికలకు అలోచించి ఓటు వేస్తాం..కదా మరి ఎమ్మెల్యేను ఎన్నుకోవడం మరి మీరు ఆలోచన చేయాలన్నారు.అవతలి వ్యక్తి ఏంటోడో అలోచించి ఓటు వేయండన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతు.150 చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వ్యక్తికి అవకాశం ఇచ్చిందంటే ఎంతకు దిగజిరిందో ప్రజలు గమనించాలన్నారు.ప్రజల కోసం కేసులు ఉంటె ఓకె.. మనుషులను చంపిన కేసులు.. పరారిలో ఉన్న వ్యక్తి పేరు పైన 30 కేసులు ఉన్నాయాని కాంగ్రెస్ పార్టీ నాయకులే చెబుతున్నారు.సుపారీ కేసులు ఉన్న వ్యక్తిని ఏమనాలి భూ దందాలు,మర్డర్ కేసులు, బెదిరించినవి..ఆయుధాల కేసులు సరఫరా చేసిన కేసులు ఆయనపై ఉన్నాయన్నారు.మరికొన్ని రోజుల్లో ఎవరు ఎలాంటి వాళ్ళో చేవెళ్ల ప్రజలకు తెలుస్తుందన్నారు. మతత్వల పార్టీలకు అవకాశం ఇవ్వకుడ వూసరవెల్లిలా పార్టీలు మరే నాయకులకు ఓటు వేస్తే చేవెళ్ల ఆగమైపోతాదన్నారు.ఊసరవెల్లికి ఓటేస్తే ఓటు మునిగి పోయినట్లే.ఆయనకు పార్టీ ముఖ్యం కాదు.పదవే ముఖ్యం, సిద్ధాంతాలు లేవు.నైతిక విలువలు లేవు.జనాలు ఏమి అనుకుంటారో అన్న సిగ్గూ లేదన్నారు.ఎప్పుడు ఏపార్టీలో ఉంటాడో తెలియదు.ఏ ఎండకాగొడుగు పట్టడం ఆయన నైజం అన్నారు.చేవెళ్ల నియోజకవర్గంలో బీజేపీ తరపున పోటీ చేస్తున్నడు పూటకో పార్టీ మారేవాళ్ళు అభివృద్ధి ఏం చేస్తారు అని ప్రశ్నించారు.ఇప్పుడు చేవెళ్ల ప్రజలు మరోసారి ఆయనకు వాత పెట్టడానికి సిద్దంగా ఉన్నారన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా నీళ్లు ఇవ్వడం జరిగిందన్నారు.111 జీవో 84 గ్రామాలకు గుదిబండగా మారిందన్నారు.69 జీవో వచ్చింది. మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుంది.ఈసీ,మూసి మీద వంతెనల మీద,చెక్ డ్యామ్ లు ఏర్పాటు చేస్తాం.అభివృద్ధి పనులు మధ్యలో ఆగిపోవద్దని,మళ్ళీ సీఎం కేసీఆర్ ను ఎన్నుకోవాలన్నారు.మరో సారి అవకాశం ఇస్తే హైదరాబాద్ తరహా చేవెళ్లను అభివృద్ధి చేస్తా నా మీద కేసు లేవు నేను భూ దందాలు చేయాలే నేను సెటిల్ మెంట్లు చేయాలే నేను క్రిమినల్ ను కాదు నా మీద క్రిమినల్ కేసులు లేవన్నారు.మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాడి…అని ప్రజలు కోరిన ఎమ్మెల్యే అభ్యర్థి కాలే యాదయ్య అన్నారు.



