కార్పెట్‌పై నడుస్తూ పడిపోయిన గవర్నర్‌ ‌తమిళి సై

చెన్నై, ఫిబ్రవరి 20 : రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళి సై కిందపడ్డారు. తమిళనాడులో జరిగిన హైబ్రిడ్‌ ‌రాకెట్‌ ‌లాంచ్‌ ఈవెంట్‌కు హాజరైన తమిళి సై..కార్పెట్‌ ‌పై నడుస్తున్న సమయంలో ఒక్కసారిగా కిందపడిపోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది గవర్నర్‌ను పైకి లేపారు. ఈ ఘటనలో ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. కానీ తాను కిందపడిన ఈ వార్త టీవీల్లో హైలైట్‌ అవుతుందంటూ సరదాగా అన్నారు. హైబ్రిడ్‌ ‌రాకెట్‌ ‌లాంచ్‌ ‌కార్యక్రమానికి హాజరైన గవర్నర్‌ ‌తమిళిసై వేదికపై జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ప్రసంగించారు. ఆ తర్వాత ఆమె నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా కార్పెట్‌పై జారి పడిపోయారు.

సుమారు 3500 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 6 నుంచి 12వ తరగతి చదివే 5వేల మంది విద్యార్థులు తయారుచేసిన 150 మినీ హైబ్రిడ్‌ ఉపగ్రహాల (పైకో శాటిలైట్స్)‌ను ప్రయోగించారు. ఈ రాకెట్‌ ‌ప్రయోగాన్ని డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ ‌కలామ్‌ ఇం‌టర్నేషనల్‌ ‌ఫౌండేషన్‌, ‌మార్టిన్‌ ‌ఫౌండేషన్‌, ‌స్పేస్‌ ‌జోన్‌ ఇం‌డియా సంయుక్తంగా చేపట్టాయి. తమిళనాడులోని మామల్లాపురంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్‌.. ‌నడుస్తూ నడుస్తూ ఒక్కసారిగా కాలు జారి కిందపడిపోయారు. అయితే గవర్నర్‌కు ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కార్యక్రమం అనంతరం గవర్నర్‌ ‌తమిళిసై అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *