ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,జూలై 17 : ప్రభుత్వ శాఖలలో పనిచేసే కాంట్రాక్ట్, అవుట్ సోర్స్ ఉద్యోగులని పర్మినెంట్ చేస్తున్నారని,గ్రామ పంచాయితీ కార్మికులు ఎం పాపం చేశారని,వారిని పర్మినెంట్ చేయడం లేదని సిఐటీయు రాష్ట్ర కార్యదర్శి సుధాకర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంచాల మండల కేంద్రంలో జరుగుతున్న గ్రామ పంచాయితీ ఉద్యోగ కార్మికులు చేస్తున్న సమ్మె శిబిరానికి వచ్చి మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయితీల్లో 50వేల మంది గ్రామపంచాయితీ సిబ్బంది 50,60 ఏళ్ల నుండి వివిధ కేటగిరిల్లో అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారని అన్నారు. వీరంత ఎస్సీ,ఎస్టీ,బలహీన వర్గాలకు చెందిన పేదలేనని తమ ఆరోగ్యాలను కూడా లెక్కచేయకుండా గ్రామాలను శుభ్రం చేస్తూ ప్రజల ఆరోగ్యాలను కాపాడుతున్నారని చెప్పారు.వీరంతా ఎస్సీ,ఎస్టీ,బీసీలు అయిందుకే పర్మినెంట్ చేయడం లేదా అని ఆయన ప్రశ్నించారు.ఐదు సoత్సరాలపాటు పదవిలో ఉండిపోయే ఎమ్మెల్యే,ఎంపిలకు లక్షల్లో వేతనాలు,దిగితే పింఛన్లు తీసుకుంటున్నారు.ఏళ్ల తరబడి చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులకు మాత్రం 8500లు వేతనాల అని అన్నారు.మీరు ఇచ్చిన పిఆర్సిలో నిర్ణయించిన మినిమన్ బేసిక్ 19వేలు విరికి ఎందుకు వర్తించదని అన్నారు.కనీసం జీవో నెం 60 ప్రకారం స్వీపర్లకు 15,600లు,పంప్ ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లు,డ్రైవర్లు,కారోబార్,బిల్ కలెక్టర్లకు 19,500లు ఇవ్వాలని కోరారు. కారోబార్, బిల్కలెక్టర్లను సహాయక కార్యదర్శులుగా నియమించాలని డిమాండ్ చేశారు.ట్రాక్టర్ డ్రైవర్లకు పంచాయతిలే డ్రైవింగ్ లైసెన్స్ఖర్చులు భరించాలన్నారు. జీవో నెం.51ని సవరించాలి.మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. ప్రమాదంలో చనిపోయిన సిబ్బంది కుటుంబానికి 10 లక్షల రుపాయయల నష్టపరిహారం ఇవ్వాలని పిఎఫ్,ఇఎస్ఐ,ప్రమాద బీమా,గ్రాట్యూటీ సౌకర్యం కల్పించాలన్నారు.ఇలాంటి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెకు దిగుతామని తెల్పి సమ్మెకు దిగిన మరుసటి రోజే ప్రభుత్వ ప్రిన్స్ పల్ సెక్రటరీ జిల్లా కలెక్టర్ లతో సమావేశం ఏర్పాటు చేసి సమ్మెను చులకన చేసి వారిని తొలగించి కొత్త వారిని పెట్టి పనులు చేయించాలని ఆదేశాలు ఇచ్చారన్నారు.అయినా భయపడకుండా 12 వ రోజుకు సమ్మె చేరుకుందని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జేఏసీ నాయకులతో చర్చలు జరిపి న్యాయమైన సమస్యలను పరిష్కరించి,సమ్మెను విరమింపజేయాలని కోరుతున్నాను. లేకుంటే సమ్మెను ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
సంఘీభావం టెలియజేసిన టిడిపి
మంచాల మండల కేంద్రంలో గత12 రోజులుగా జిపి కార్మికులు సమ్మె చేస్తున్న శిబిరం వద్దకు టిడిపి నాయకులు వచ్చి మద్దతు తెలిపి తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మెను ఉధృతం చేయాలని అందుకు టిడిపి మద్దతు ఉంటుందని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ చింత కింది చక్రపాణి తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,బిఆర్ఎస్ పార్టీ అవిలంబిస్తున్న తీరును ఎండ కట్టాలని కార్మికులకు పిలుపునిచ్చారు.కార్మికులకు సరైన వేతనం ఇవ్వాలని,రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గ్యార పాండు,సిఐటియూ మండల కన్వీనర్ పోచమోని కృష్ణ,గ్రామ పంచాయితీ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఖాజా పాషా,భాస్కర్,నాయకులు మాధవి,జంగయ్య,యాదయ్య,జ్యోతి,స్వరూప,సుజాత,దర్శన్,వెంకటయ్య,అర్జున్ శంకరయ్య,సురేష్,చెన్నయ్య, తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు కృష్ణ,మైనార్టీ సెల్ నాయకులు సలాం భాయ్,రాష్ట్ర మహిళా నాయకురాలు మంకు ఇందిరా,తెలుగు యువత మండల అధ్యక్షులు బూరుగు ఐలయ్య యాదవ్, పగడాల ఆనంద్,కొంగర వెంకటరెడ్డి,మంగలరం శంకర్,భద్రయ్య, నోముల గ్రామ శాఖ అధ్యక్షులు రాజేష్ యాదవ్,మహేష్ తదితరులు పాల్గొన్నారు.




