కాంగ్రెస్ పేదల పార్టీ 

చేవెళ్ల అడ్డా కాంగ్రెస్ అడ్డా 
బిజెపి పేదలను దోచుకుంది
 బెదిరింపులకు పాల్పడుతున్న బీఆర్ఎస్ 
భీం భరత్ ను భారీ మెజార్టీతో గెలిపించండి  
అంతారం గ్రామ కాంగ్రెస్ నాయకులు జనరల్ సెక్రెటరీ నడికుడే సంజయ్ గౌడ్ 
ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్ 28:పేద ప్రజల సంక్షేమం కోసమే పని చేసిందాని అంతారం కాంగ్రెస్ పార్టీ నాయకులు జనరల్ సెక్రెటరీ నడికుడే సంజయ్ గౌడు అన్నారు.బలహీన వర్గాల ప్రజల యొక్క శ్రేయస్సు కోరిందన్నారు.చేవెళ్ల గడ్డ కాంగ్రెస్ అడ్డా అని,ఎమ్మెల్యే అభ్యర్థి పామేనా భీమ్ భరత్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు.బిఆర్ఎస్ బిజెపి పార్టీలు మధ్యతరగతి ప్రజలను అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టారన్నారు.బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నిస్తే బెదిరింపులు చేస్తున్నారన్నారు.సామాన్య ప్రజల భూములను బీఆర్ఎస్ ప్రభుత్వంఆక్రమించుకుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు అభివృద్ధి,ఆరోగ్యం,కనీసవసరాలు తీర్చే నిత్యవసర వస్తువులు అందుబాటులోఉన్నాయన్నారు. ఓటర్లు అందరు గమనించి 30 తారీఖున జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భీమ్ భరత్ ను గెలిపించాలని ఎన్ సంజయ్ గౌడు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *