ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్ 9: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పామేనా భీమ్ భరత్ పుట్టినరోజు సందర్భంగా ఇబ్రహీంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నక్కలపల్లి మల్లేష్,సొసైటీ డైరెక్టర్ పైండ్ల మధుసూదన్ రెడ్డి,వార్డు మెంబర్ రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపల్లి యువకులను ఎమ్మెల్యే అభ్యర్థి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం కేక్ కటింగ్ చేయించి యువకుల నోరు తీపి చేయించిన ఎమ్మెల్యే అభ్యర్థి భీమ్ భరత్.ఈ సందర్భంగా సొసైటీ డైరెక్టర్ పైండ్ల మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ…. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని ఓటు వేసి అత్యధిక మెజారిటీతో మన అభ్యర్థిని గెలిపించి మనమందరం కలిసి వారి నోటిని తీపి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో. వార్డు మెంబర్లు కమ్మెట నరసింహులు,బేగరి యాదయ్య,యువకులు.. వెంకట్ రాజ్,వెంకటేష్,యాదయ్య, మహేందర్,అనిల్,సురేష్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు





