కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యం

వికారాబాద్ జిల్లా ప్రజాతంత్ర నవంబర్ 6:  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యపడుతుందని చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని వికారాబాద్ నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు సర్పరాజ్ వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు హాజీ పాషలు కోరారు. సోమవారం వికారాబాద్ పట్టణంలోని మెయిన్ రోడ్ షాపులలో వ్యాపారులను కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసానికి గురిచేసారని పేర్కొన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని నిరుద్యోగులకు ప్రతి ఇంటికి ఉద్యోగం కల్పిస్తామని దళితులకు మూడెకరాల పొలం ఇస్తామని రైతు రుణమాఫీ ఏకకాలంలో లక్ష రూపాయలు మాఫీ చేస్తామని ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని పేర్కొన్నారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం కేసీఆర్ ముస్లిం మైనార్టీలను తీరని మోసానికి గురిచేసారన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్న కాలంలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించి ముస్లిం పిల్లలు చక్కగా చదువుకొని ఉద్యోగాలు సాధించారని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ లతో పాటు పేదల అభివృద్ధికి అవసరమాకు సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రమేష్ కుమార్ మల్లికార్జున గౌడ్ ఎం ఆనంద్ గాండ్ల శివానంద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *