పరిగి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 19: కాంగ్రెస్ పార్టీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వికారాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు,పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు.శనివారం పరిగి పట్టణంలో పరిగి మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల గురించి బూతుల వారిగా ప్రచారం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 80 సంవత్సరాల పైబడి ఉన్నవారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వినియోగించుకునే అవకాశం వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు లక్షల రుణమాఫీ చేస్తారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పరిగి నియోజకవర్గంలో 42 వేల ఇందిరమ్మ ఇళ్లను కట్టించామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రియాంక గాంధీ చెప్పిన మాటలను గుర్తు చేశారు. బిజెపి పార్టీ రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చిందని ఈ చట్టానికి బిఆర్ఎస్ ప్రభుత్వం మద్దతు ఇచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అసైన్డ్ భూములపై ఉన్న చట్టంలో మార్పులు తీసుకొస్తామని, రైతులు పండించే ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు.బిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి మోసం చేసిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ భృతి బదులుగా చార్జింగ్ స్కూటర్ని ప్రతి ఒక్క నిరుద్యోగికి ఇస్తామని చెప్పిన ప్రియాంక గాంధీ మాటలను గుర్తు చేశారు. పరిగి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కోచింగ్ సెంటర్ ద్వారా 15 మందికి ఎస్సై ఉద్యోగాలు వచ్చాయని, పరిగి నియోజకవర్గం జోగులాంబ జోన్లో కలిపితే దాన్ని చార్మినార్ జోన్లో కలపడానికి ముందుండి పోరాటం చేసింది కాంగ్రెస్ కార్యకర్తలని అన్నారు. రైల్వే లైన్ ని పరిగి రాకుండా బిఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుందని, మోడీ నోట్ల రద్దుకు, రైతు వ్యతిరేక చట్టాలకి బిఆర్ఎస్ ప్రభుత్వం సపోర్ట్ చేసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నాలుగువేల పింఛన్ ఇస్తుందని రైతుబంధు ఎకరాకి 15000 ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పరిగి మండల అధ్యక్షులు భూమన్న గారి పరశురాం రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు లాల్ కృష్ణ, పట్టణ అధ్యక్షులు ఎర్రగడ్డ పల్లి కృష్ణ , జిల్లా స్పోక్ పర్సన్ శ్రీనివాస్ గుప్త, శశిధర్ రెడ్డి, పరిగి మండల మహిళా అధ్యక్షురాలు ప్రేమలత, ఉపాధ్యక్షులు ఆనంద్, ఎస్టీ సెల్ అద్యక్షులు తౌర్య నాయక్, సర్పంచులు బందయ్య, రాజ పుల్లారెడ్డి, సురప్ప, వెంకటయ్య, యాదయ్య, ఎంపీటీసీలు జహంగీర్, రవీందర్ రెడ్డి, వెంకటేష్, మాజి సర్పంచ్ నర్సింలు, ఉప సర్పంచ్ మహేష్, మైనారిటీ నియోజకవర్గ నాయకులు అయుభ్, యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి నాగవర్ధన్న్, వెంకటేష్, ఎస్సీ సెల్ అద్యక్షులు రత్నం, రాకేష్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మండల పరిధిలోని వివిధ గ్రామపంచాయతీల అధ్యక్షులు, ఎంపీటీసీలు, బూత్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు , తదితరులు పాల్గొన్నారు.




