- వారు ఉలిక్కిపడుతున్న తీరే నిదర్శనం
- కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ
కామారెడ్డి, ప్రజాతంత్ర, అగస్ట్ 30 : కాంగ్రెస్‌ను విమర్శించడం చూస్తుంటే బిఆర్ఎస్లో భయం మొదలయ్యిందని మాజీమంత్రి షబ్బీర్ అలీ అన్నారు. అందుకే కాంగ్రెస్ డిక్లరేషన్‌పై ఉలిక్కిపడుతున్నారని అన్నారు. లేనిపోని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ఇచ్చిన హావి•ని కనీసం ఇప్పుడైనా అమలు చేయాలన్నారు. నిజంగానే దళితులపై ప్రేమ ఉంటే వెంటనే దళిత సిఎంను చేసి చిత్తశుద్ది చాటుకోవాలని షబ్బీర్ అలీ అన్నారు. మాటతప్పిన కేసీఆర్ అసలు దళిత ద్రోహి అని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలోనే దళితులకు భూముల పంపిణీ, ఇళ్ల పంపిణీ వంటివి జరిగాయని అన్నారు. దళితులకు రాజకీయంగా పెద్దపీట వేసింది కూడా కాంగ్రెస్ పార్టీ అన్నారు.
ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇచ్చిన హావి• మేరకు కర్నాటకలో రాహుల్ వివిధ పథకాలను బుధవారం ప్రారంభించారని అన్నారు. దీన్ని చూసైనా నేర్చుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పినది చేస్తుందని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుంటే తమరంతా ఎక్కడ ఉండేవారో అని ఎద్దేవా చేశారు. సోనియా దయవల్లనే తమరు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌కు కామారెడ్డిలో భంగాపాటు తప్పదన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఒక్కటి కాదు అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అలైబలై పార్టీలని, ప్రజలను మోసం చేశారని ఆయన విమర్శించారు.




