కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం

  • సభకు క్షమాపణ చెప్పాలని బిజెపి డిమాండ్‌
  • ‌సభ బయట చేసిన వ్యాఖ్యలపై స్పందించనన్న ఖర్గే

జయపుర, డిసెంబర్‌ 20 : ‌రాహుల్‌ ‌జోడో యాత్రలో కాంగ్రెస్‌ ‌పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ‌ఖర్గే చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం రేగింది. ఖర్గే వ్యాఖ్యలపై మంగళవారం రాజ్యసభలో తీవ్ర దుమారం చెలరేగింది. ఒక రాజకీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడై ఉండి నోటికొచ్చిన వ్యాఖ్యలు చేసిన ఖర్గే తమకు క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్‌ ‌చేశారు. కేంద్రమంత్రులు పీయూష్‌ ‌గోయెల్‌, ‌కిరణ్‌ ‌రిజుజు, ప్రహ్లాద్‌ ‌జోషి ఖర్గే వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అయినా ఖర్గే మాత్రం అదరలేదు, బెదరలేదు. బీజేపీ నేతలు ప్రస్తావిస్తున్న వ్యాఖ్యలు తాను పార్లమెంట్‌లో చేయలేదని, పార్లమెంట్‌ ‌బయట తాను చేసిన వ్యాఖ్యలపై సభలో చర్చించాల్సిన అవసరం లేదని అన్నారు. బీజేపీ నేతలకు ప్రతి దానికి క్షమాపణ అడగటం అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు.

తాను సభ బయట చేసిన వ్యాఖ్యలను సభలో కూడా చేశానంటే వాళ్లు (బీజేపీ నేతలు) మరింత ఇబ్బందుల్లో పడాల్సి వస్తుందని రాజ్యసభ చైర్మన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పేలేదని, ఇప్పటికీ తాను ఆ వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని ఖర్గే చెప్పారు. భారతదేశ స్వాతంత్య్ర కోసం కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రాణ త్యాగాలు చేసిందని, దేశ ఐక్యత కోసం ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ తమ ప్రాణాలను అర్పించారని కాంగ్రెస్‌ ‌పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ‌ఖర్గే వ్యాఖ్యానించారు.  బీజేపీకి మాత్రం స్వాతంత్య ్రపోరాటంలో ఎలాంటి పాత్ర లేదని, దేశం కోసం బీజేపీ నేతల ఇళ్లలో కనీసం కుక్క కూడా చావలేదని మల్లిఖార్జున్‌ ‌ఖర్గే సోమవారం అన్నారు.

భారత్‌ ‌జోడో యాత్రలో భాగంగా రాజస్థాన్‌లోని అల్వార్‌లో మాట్లాడిన ఖర్గే.. ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, దేశ స్వాతంత్య ్రపోరాటంలోగానీ, ఐక్యతలో గానీ బీజేపీ నేతల పాత్ర ఏముందని ప్రశ్నించారు. దేశం కోసం బీజేపీ నుంచి ఎవరు ప్రాణ త్యాగాలు చేశారని నిలదీశారు. దేశ కోసం పోరాడిన వాళ్లను ఈ మాఫీ మాంగ్‌నే వాలే లోగ్‌ (‌బీజేపీ నేతలు) క్షమాపణ కోరడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *