కల్వకుర్తి ప్రజలే నా బలం  నా బలగం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 6 : కుల మతాల కతీతంగా ఒక్కసారి తనను కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలిపిస్తే కల్వకుర్తి నగర, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని కల్వకుర్తి ప్రజలే నా బలం.. నా బలగమని బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కల్వకుర్తి పట్టణంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా ముస్లిం మైనార్టీలు నివసించే ప్రాంతాలలో ఆచారి ప్రచారం నిర్వహించి ఓట్లు అడిగారు.  కల్వకుర్తి మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే అది బిజెపికే సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాబోతుందని ఆచారి చెప్పారు. మీలో ఒక కుటుంబ సభ్యుడిగా అన్నగా తమ్ముడిగా అండగా ఉంటానన్నారు. ఐదేళ్లు  కనపడని వ్యక్తులు ఐదు నెలల ముందు మాత్రం ఎన్నికల్లో ఓట్లు సాధించాలనే ఉద్దేశంతో మీ దగ్గరికి వస్తున్నారని మీరు వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజల సమస్యల పైన పూర్తిగా అవగాహన ఉన్న తనకు ఒకే ఒక్క అవకాశం ఇచ్చి చూడాలన్నారు. ప్రజలకు కష్టసుఖాల్లో ఉన్న సమయంలో అండగా ఉన్నానని గుర్తు చేశారు. తొమ్మిది రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి కుల మత, రాజకీయ వర్గాలను ఒకటి చేసి ఆర్డీవో కార్యాలయాన్ని సాధించిన ఘనత బిజెపి దేననీ ఆచారి గుర్తు చేశారు. మనకు మన అభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తికే ఓటు వేయాలన్నారు. ఎన్నికల వాగ్దానాలు చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఎన్నికల తరువాత అవి నెరవేర్చకుండా గాలికి వదిలేస్తున్నారన్నారు. కల్వకుర్తి పట్టణంలో శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వెంకటేశ్వర కాలనీ, ఇంద్రనగర్ లో ఇంటింటికి గడపగడపకు భారీ ర్యాలీగా తిరుగుతూ విస్తృతంగా.. ముమ్మరంగా ప్రచారం కొనసాగించారు.ఈ
కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ సీనియర్ లీడర్ బండెల రామచంద్ర రెడ్డి, అభిలాష్ రెడ్డి, బాబ్జి, కృష్ణ గౌడ్, బోడ నరసింహ, శేఖర్ రెడ్డి, నర్సిరెడ్డి, రవి సురేందర్ గౌడ్, రాఘవేందర్ గౌడ్, శ్రీకాంత్, అభినవరెడ్డి, చంద్రశేఖర్, శ్యాంసుందర్ బీజేపీ నాయకులు మండల నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *